Breaking News

మరో ఇద్దరు నర్సులకు నిఫా!

Published on Thu, 01/15/2026 - 04:59

కోల్‌కతా: కోల్‌కతాలో నిఫా వైరస్‌ కలకలం రేపుతోంది. తాజాగా మరో ఇద్దరు నర్సుల్లో నిఫా లక్షణాలు కన్పించాయి. వారిని వెంటనే బేలీఘాటా ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌ ఆస్పత్రిలో చేర్చి పర్యవేక్షణలో ఉంచారు. వీరితోపాటు బురాద్వన్‌ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ఓ హెల్త్‌ వర్కర్‌కు వైద్య చికిత్స అందిస్తున్న మరో ఇద్దరికి ఈ వైరస్‌ సోకినట్టు తేలింది. వారిలో ఒకరిని బుధవారం అర్ధరాత్రి హుటాహుటిన సిటీ హాస్పిటల్‌లో చేర్పించారు. మరొకరిని బుధవారం ఉదయమే బర్ధమాన్‌ ఆస్పత్రికి తరలించారు. 

వారి శాంపిళ్లలను పరీక్షల నిమిత్తం పంపినట్టు ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరు నర్సులు అంతకుముందే నిఫా బారిన పడటం తెలిసిందే. వారి పరిస్థితి ప్రస్తుతం చాలా ఆందోళనకరంగా ఉన్నట్టు వివరించాయి. ‘‘వారిప్పటికీ కోమాలోనే ఉన్నారు. ఐసీసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని అధికారులు వెల్లడించారు. అంతేగాక ఈ నర్సులతో కలిసి వైద్య సేవలందించిన ఓ రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌లోనూ నిఫా లక్షణాలు కన్పించడం కలకలం రేపుతోంది. ఆయనను ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షిస్తున్నారు. తొలి దఫా పరీక్షల ఫలితాలైతే నెగెటివ్‌గా వచ్చినట్టు వైద్యులు తెలిపారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)