Breaking News

త్వరలో గౌహతి–కోల్‌కతా వందేభారత్‌ స్లీపర్‌ 

Published on Thu, 01/01/2026 - 15:26

న్యూఢిల్లీ: ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గౌహతి–కోల్‌కతా వందే భారత్‌ స్లీపర్‌ రైలు త్వరలోనే పట్టాలపైకి ఎక్కనుంది. ఈ రైలును మరో 15–20 రోజుల్లో, అంటే జనవరి 18 లేక 19వ తేదీల్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో కచి్చతమైన షెడ్యూల్‌ ఖరారవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ గురువారం వెల్లడించారు. మొత్తం 16 బోగీలుండే ఈ రైలులో 823 మంది ప్రయాణించవచ్చన్నారు.

 గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ఇది నడుస్తుందని ఆయన వివరించారు. అయితే, ప్రస్తుతానికి 120–130 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించనుందన్నారు. విమాన ఛార్జీలతో పోలిస్తే వందే భారత్‌ స్లీపర్‌ రైలు టికెట్‌ ధరలు చాలా చౌక అని చెప్పారు. గౌహతి–కోల్‌కతా విమాన ప్రయాణ ఖర్చు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఉంటుందని గుర్తు చేసిన ఆయన.. వందే భారత్‌ థర్డ్‌ క్లాస్‌ ఏసీ టికెట్‌ ధర సుమారు రూ.2,300, సెకండ్‌ క్లాస్‌ ఏసీ రూ.3 వేలు, ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ టికెట్‌ ధర రూ.3,600 వరకు ఉంటాయన్నారు. ఆహారం ధర కూడా ఇందులోనే కలిపి ఉంటుందని మంత్రి చెప్పారు. 

గౌహతి నుంచి మొదలయ్యే రైలులో అస్సామీల ఆహారం, కోల్‌కతా నుంచి మొదలయ్యే రైలులో బెంగాలీ భోజనం అందుబాటులో ఉంటాయని చెప్పారు. మధ్య తరగతి ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని టికెట్‌ ధరలను నిర్ణయించామన్నారు. ఫస్ట్‌క్లాస్‌ ఏసీ అయితే కిలోమీటరుకు రూ.3.8, సెకండ్‌ క్లాస్‌కు రూ.3.1, థర్డ్‌ క్లాస్‌ ఏసీ కిలోమీటరు ప్రయాణానికి రూ.2.4 వరకు చార్జీ ఉంటుందని చెప్పారు. గౌహతి–కోల్‌కతా వందేభారత్‌ స్లీపర్‌ రైలులోని 16 కోచ్‌లకు గాను 11 థర్డ్‌ ఏసీ కోచ్‌లు, నాలుగు సెకండ్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌లు, ఒక ఫస్ట్‌క్లాస్‌ ఏసీ ఉంటాయని తెలిపారు.  అత్యంత భద్రతా ప్రమాణాలు, శుభ్రత, సుఖంగా ఉండే సీటింగ్, ఆటోమేటిక్‌ డోర్లు, ఆటోమేటిక్‌ ట్రెయిన్‌ ప్రొటెక్షన్‌ కవచ్‌ దీని ఇతర ప్రత్యేకతలని వివరించారు. 
 

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)