Breaking News

10 మంది తెలుగు పోలీసులకు కేంద్ర హోంశాఖ మెడల్స్

Published on Sat, 08/12/2023 - 11:22

న్యూఢిల్లీ: 2023 సంవత్సారానికి గానూ దేశవ్యాప్తంగా 140 మంది పోలీసు అధికారులు కేంద్ర హోంశాఖ అందించే ఇన్వెస్టిగేషన్‌లో ఎక్సలెన్స్‌ మెడల్స్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు అవార్డు పొందిన వారి జాబితాను కేంద్ర హోంశాఖ శనివారం ప్రకటించింది.

ఇక ఈ ఏడాది అవార్డులు అందుకున్న వారిలో సీబీఐ నుంచి 15 మంది, ఎన్‌ఐ నుంచి 12 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 10 మంది, కేరళ, రాజస్థాన్ నుంచి తొమ్మిది మంది చొప్పున, తమిళనాడు నుంచి 8, మధ్యప్రదేశ్ నుంచి ఏడుగురు, గుజరాత్ నుంచి ఆరుగురితోపాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు ఉన్నారు. కాగా వీరిలో 22 మంది మహిళా పోలీసులు ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి పది మంది పోలీసులకు మెడల్స్‌ లభించాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అయిదుగురు, తెలంగాణ నుంచి అయిదుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ ఎక్సలెన్స్‌ మెడల్‌ దక్కాయి.

ఏపీ నుంచి..
► గుంట్రెడ్డి అశోక్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్
►షేక్‌ మన్సూరుద్దిన్‌, ఇన్‌స్పెక్టర్
►ధనుంజయుడు మల్లెల, డీఎస్పీ
►కొర్లకుంట సుప్రజ, డీఎస్పీ
►ఉప్పుటూరి రవిచంద్ర, డీఎస్పీ

తెలంగాణ నుంచి..

►మేకల తిరుపతన్న, అడిషనల్‌ ఎస్పీ
►రాజుల సత్యనారాయణ రాజు, డీఎస్పీ
►మూల జితేందర్‌ రెడ్డి, ఏసీపీ
►కమ్మాపల్లి మల్లిఖార్జున కిరణ్‌కుమార్‌, డీఎస్పీ
►భూపతి శ్రీనివాసరావు, ఏసీపీ

కాగా కేంద్ర హోంమంత్రిత్వశాఖ అందించే ఈ పతకాన్ని 2018లో ఇవ్వడం ప్రారంభించగా.. ప్రతి ఏడాది ఆగస్టు 12వ తేదీనా ప్రకటిస్తారు. నేర పరిశోధనలో ఉన్నత వృత్తిపరమైన ప్రమాణాలను ప్రోత్సహించడం, విచారణలో వారి ప్రతిభను గుర్తించి గుర్తించి ఈ అవార్డు అందిస్తారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)