Breaking News

కోతి చేసిన పనికి చిన్నారి బలి?

Published on Wed, 07/22/2026 - 13:00

కర్ణాటక: ఓ కోతి తీవ్ర విషాదానికి కారణమైంది. చిక్క తాలూకా పరిధిలోని పెరేసంద్ర గ్రామంలో శశికళ (11) అనే బాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనారోగ్యంతో చనిపోగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా చేశారు. వివరాలు.. నవీన్, చంద్రిక  దంపతుల కుమార్తె శశికళ ఇంటి ముందు టిఫిన్‌ తింటుండగా ఓ కోతి టిఫిన్‌ను లాక్కుంది. భయపడిన బాలిక ఇంట్లోకి పారిపోయి నీళ్లు తాగుతూ హఠాత్తుగా పడిపోయింది. తల్లిదండ్రులు పెరేసంద్ర పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడ ఆక్సిజన్‌ వసతి లేదు, చిక్కబళ్లాపురానికి పిలుచుకుపోవాలని వైద్యులు సూచించారు. అక్కడికి తీసుకెళ్తుండగా పాప దారిలోనే కన్నుమూసింది.   

వైద్యం చేసి ఉంటే బతికేది 
ఆక్రోశానికి గురైన కుటుంబీకులు, గ్రామస్తులు పెరేసంద్ర ఆసుపత్రి ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌ సొంత గ్రామంలో ఆస్పత్రిలో కనీస సౌలభ్యాలు లేకుంటే ఎలా అని నిలదీశారు. సమాజ సేవకులు సందీప్‌రెడ్డి మాట్లాడుతూ సమయానికి ఆక్సిజన్, వైద్యం అంది ఉంటే పాప బతికేది అన్నారు.  డిహెచ్‌ఓ మహేశ్‌కుమార్‌ నిరసనకారులతో చర్చించారు, 20 రోజులలో సమస్యలను సరిదిద్దుతామని, డాక్టర్‌ను రెండు రోజులలో నియమిస్తామని హామీ ఇచ్చారు. ఎడిసి భాస్కర్, డీఎస్పీ ప్రకాశ్‌ తదితరులు తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో ధర్నాను విరమించారు.      

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)