1,100 మంది వేదాచార్యులతో సరయూ హారతి

Published on Thu, 10/24/2024 - 10:08

లక్నో: ఉత్తరప్రదేశ్‌ యోగి సర్కారు అక్టోబర్‌ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి.

ఈ దీపోత్సవ్‌కు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరుకానున్నారు. లక్ష్మణ్ ఖిలా ఘాట్ నుంచి నయా ఘాట్ వరకు 1100 మంది వేదాచార్యులతో సరయూ హారతి నిర్వహించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని యోగి ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ తెలిపారు. రామ్ కీ పైడీలో లక్షల దీపాల మధ్య భారీ వేదికపై కళాకారులచేత సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ దీపోత్సవంలో ఆరు దేశాలకు చెందిన కళాకారులు రాంలీలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా థాయ్‌లాండ్, కంబోడియా, ఇండోనేషియా, మయన్మార్, మలేషియా, నేపాల్‌కు చెందిన కళాకారులు తమ ప్రతిభను చాటనున్నారు.  అలాగే కశ్మీర్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, చండీగఢ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన కళాకారులు అయోధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)