Breaking News

24 గంటల్లో.. 11 విమానాలకు బాంబు బెదిరింపులు

Published on Sat, 10/19/2024 - 15:29

దేశంలో విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి.  తాజాగా గడిచిన 24 గంటల్లో 11 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇలా వరుసపెట్టి బెదిరింపులు రావడం ప్రయాణికుల్లో తీవ్ర భయాన్ని రేకెత్తిస్తోంది. విమానాల టేకాఫ్‌కు ముందు ఇటువంటి బెదిరింపులు రావటంతో పలుచోట్ల తనిఖీలు నిర్వహించి దారి మళ్లిస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఢిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే విస్తారా విమానానికి బాంబు బెదిరింపుతో జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. జైపూర్-దుబాయ్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బెదిరింపు వచ్చింది. అయితే అది నకిలీ అని తేలింది. వీటితోపాటు మరో ఐదు ఆకాశా ఎయిర్ విమానాలు, ఐదు ఇండిగో విమానాలకు నేడు బాంబు బెదిరింపులు వచ్చాయి.

దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు కారణంగా విమానాశ్రయం నుంచి టేకాఫ్ చేసేందుకు ఆలస్యం అయింది. ఈరోజు ఉదయం 6:10 గంటలకు టేకాఫ్ షెడ్యూల్ చేయగా..  7:45కి దుబాయ్‌కి బయలుదేరింది. మరోవైపు ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించిన విస్తారా విమానం ఆ తర్వాత లండన్‌కు బయలుదేరింది.

కాగా గత సోమవారం నుంచి దాదాపు 50 విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.దీంతో పౌర విమానయాన మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. నకిలీ బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేదుకు సిద్ధమైంది. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. బూటకపు కాలర్లను ఐదేళ్లపాటు నో-ఫ్లై లిస్ట్‌లో ఉంచడం వంటి అనేక చర్యలు తీసుకుంటామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజేసీఏ) తెలిపింది. అయితే నకిలీ బాంబు బెదిరింపుల వల్ల తమకు జరిగిన నష్టాన్ని నిందితుల నుంచి వసూలు చేయాలని విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి.
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)