Breaking News

ViRosh అచ్చమైన దేవతలా ఆమె, ఆభరణాలతో కొత్త ట్రెండ్‌

Published on Fri, 02/27/2026 - 14:30

లవ్‌బర్డ్స్‌ విజయ్ దేవరకొండ,  రష్మిక మందన్న ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో   అత్యంత వైభవంగా పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని అత్యంత గోప్యంగా నిర్వహింకున్న వీరిద్దరూ పెళ్లి వేడుక ఫోటోలను సోషల్‌ మీడియాలో  పంచుకోవడంతో ఫ్యాన్స్‌ అంతా సంబరాలు చేసుకున్నారు. ఏఐ కాదు ఒరిజినల్‌ అంటూ తమ అభిమాన నటుల వెడ్డింగ్‌ను సెలబ్రేట్‌  చేసుకున్నారు. అయితే   సంస్కృతి,కళ, సంప్రదాయాల ప్రాముఖ్యతల కలయికతో  రాజసం ఉట్టిపడేలా , ప్రత్యేకంగా చేత్తో తయారు చేసిన ఆభరణాలు వారి రాయల్ వెడ్డింగ్‌ను మరింత వైభోగంగా మార్చాయి. విరోష్‌ పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో రికార్డ్‌ సృష్టించాయి.

కర్ణాటకకు చెందిన మందన్న కొడవ వంశం, దేవరకొండ తెలుగు మూలాల సంప్రదాయాలను గౌరవిస్తూ  రాయల్‌ లుక్‌లో అదరగొట్టారు. ఈ జంట దక్షిణ భారత సాంప్రదాయ వివాహ దుస్తులు , పురాతన ఆలయ ఆభరణాలతో స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా కనిపించారు. విరోష్  వివాహంలో  వధూవరుల ఆభరణాలు, ముఖ్యంగా విజయ్‌ దేవర కొండ ధరించిన చెవి రింగ్స్‌, సాంప్రదాయ హరామ్‌లు, స్టేట్‌మెంట్ ఝుమ్కాలు, జడ బిల్లా, చంపసరాలు, హత్‌ఫూల్, మఠపట్టి, ముక్కు పిన్, గాజులు, బాజుబంద్, నడుము బెల్ట్,  చోకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  హై-రిలీఫ్ నక్షి పని , క్లిష్టమైన రావ గ్రాన్యులేషన్ లాంటి  మాస్టర్ ఆర్టిస్టులచే చేతితో రూపుదిద్దుకున్నాయని ఆభరణాల నిపుణులు పేర్కొన్నారు.  ఈ వివాహ ఆభరణాలను ఒక బలమైన థీమ్‌తో రూపొందించారట. విజయ్‌ను ఒక శక్తివంతమైన రాజుగా, రష్మికను ఒ‍క దేవతగా ప్రతిబింబించేలా ఈ డిజైన్లు  శ్రీ జ్యువెలర్స్ (Shree Jewellers)  తీర్చిదిద్దింది.

పది నెలల కష్టం.. కిలోల కొద్దీ బంగార అద్భుత సృష్టి
న్యూస్ 18 కథనం ప్రకారం, శ్రీ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్ , కౌశిక్ కుమార్ ఈ జంటతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతిగా పేర్కొన్నారు. విరోష్‌ జీవితంలో ఒక ముఖ్యమైన వేడుకలో తాము భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ ఆభరణాల తయారీకి సంబంధించి ఆలోచన మొదలు , చివరి రూపం తీసుకొచ్చేవరకు సుమారు పది నెలల సమయం పట్టింది. ఇందులో క్రియేటివ్ చర్చలు, కస్టమైజేషన్, మేకింగ్ , స్టైలింగ్ వంటి అనేక దశలు ఉన్నాయి. దక్షిణ భారత సాంప్రదాయ పద్ధతులైన రావా గ్రాన్యులేషన్ (Rava granulation)  దీప్ నక్షి (Deep Nakshi)తో ఈ కళాఖండాలను రూపొందించారు.

దేవతలా రష్మిక మందన్న
వివాహ వేడుకలో రష్మిక 11 రకాల ప్రత్యేక ఆభరణాలతో మెరిసిపోయింది.దక్షిణ భారత దేవాలయ శిల్పాల నుండి స్ఫూర్తి పొంది, అనుభవజ్ఞులైన కళాకారుల నక్షి పనితనం,యాంటిక్ మ్యాట్ పాలిష్ (Antique matte polish) ఆభరణాలు ఆకర్షణీయంగా నిలిచాయి. లేయర్డ్ చోకర్, సాంప్రదాయ హారాలు, జుంకాలు, జడ బిళ్ళ, చెంపసరాలు, హాత్ ఫూల్, మఠాపట్టి, ముక్కు పుడక, గాజులు, బాజుబంద్ (వంకీ), వడ్డాణం , పట్టీలు ఈ సెట్‌లో ఉన్నాయి. ఇవి కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, తరతరాలకు గుర్తుండిపోయే వారసత్వ ఆభరణాలుగా (Heirloom pieces) నిలిచిపోయేలా రూపొందించబడ్డాయి.

విజయ్ దేవరకొండ అలంకరణ: సాధారణంగా భారతీయ వివాహాల్లో వరుడి ఆభరణాల గురించి పెద్దగా పట్టింపు ఉండదు. కానీ విజయ్ దేవరకొండ ట్రెండ్‌కు భిన్నంగా పెద్ద చెవిపోగులు, మణికట్టు కఫ్, ఉంగరం రెండు నెక్లెస్‌లు, కాళ్లకు కడియాలు, నడుము ఆభరణాలతో పురుషుల వెడ్డింగ్ జ్యువెలరీకి విజయ్ కొత్త మార్క్‌ను క్రియేట్‌ చేశారు. డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన రస్ట్ ఆరెంజ్ చీరను ధరించగా, విజయ్ దేవరకొండ ఐవరీ ధోతీ , ఎరుపు రంగు అంగవస్త్రంతో  కళకళలాడుతూ అలరించారు. 

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు