Breaking News

Yatra 2 Update: ఒక్కటి గుర్తు పెట్టుకోండి!

Published on Mon, 07/03/2023 - 04:07

‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు.. కానీ, ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్‌ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ‘యాత్ర 2’ సినిమా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్‌. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి బయోపిక్‌గా డైరెక్టర్‌ మహీ వి. రాఘవ్‌ తెరకెక్కించిన ‘యాత్ర’ (2019) సినిమా మంచి విజయం అందుకుంది. ‘యాత్ర’ కి సీక్వెల్‌గా ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బయోపిక్‌తో ‘యాత్ర 2’ ఉంటుందని మహీ వి.రాఘవ్‌ గతంలోనే ప్రకటించారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నెల 8న వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ అప్‌డేట్‌ ఉంటుందని అందరూ అనుకున్నారు. అయితే వారం ముందే అప్‌డేట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసింది చిత్రయూనిట్‌. మహీ వి.రాఘవ్‌ దర్శకత్వంలో వి.సెల్యులాయిడ్‌పై శివ మేక నిర్మించనున్న ఈ సినిమాని 2024 ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయనున్నట్లు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ కథ సాగుతుంది. ఇందులో జగన్‌ పాత్రలో ‘రంగం’ మూవీ ఫేమ్‌ జీవా నటించనున్నారు. ఆగస్టు 3 నుంచి ‘యాత్ర 2’ షూటింగ్‌ మొదలవుతుంది.
 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)