Breaking News

ఆస్కార్‌ బరిలో...

Published on Mon, 11/02/2026 - 04:06

ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఉయ్‌ వేర్‌ హియర్‌’ ఆస్కార్‌ రేసులో నిలిచింది. అరిందోల్‌ బాగ్చి, దేవేంద్ర డోడ్కే, కల్పనా గగ్డేకర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన షార్ట్‌ ఫిల్మ్‌ ఇది. ప్రణవ్‌ భాసిన్‌ దర్శకత్వం వహించారు. పామ్‌ స్ప్రింగ్స్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫెస్ట్, క్లెర్మాంట్‌–ఫెర్రాండ్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌... ఇలా దాదాపు 80 ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైన ఈ షార్ట్‌ ఫిల్మ్‌ సుమారు 20 అవార్డులను గెలుచుకుంది. 

పామ్‌ స్ప్రింగ్స్‌ ఇంటర్నేషనల్‌ షార్ట్‌ఫెస్ట్‌లో అవార్డును సాధించడంతో ‘బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌’ విభాగంలో ఆస్కార్‌ అవార్డు కోసం ఈ సినిమా అర్హత సాధించింది. ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు ప్రియాంక  చోప్రా జోనాస్, హాలీవుడ్‌ నటుడు ఆండ్రూ స్కాట్‌ ఎగ్జిక్యూటివ్‌  ప్రోడ్యూసర్స్‌. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయనే భయంతో ముగ్గురు రిటైర్డ్‌ వ్యక్తులు నిరసన తెలపడానికి సిద్ధం అవుతారు.

 ఇదే సమయంలో ఈ ముగ్గురు రిటైర్డ్‌ ఉద్యోగుల్లోని ఒకరి కొడుక్కి ఏఐ కంపెనీలో ఉద్యోగం వస్తుంది. కానీ తన తండ్రి చేత నిరసనను మాన్పిస్తేనే ఆ కొడుక్కి ఆ ఉద్యోగం ఖరారవుతుంది. మరి... ఆ తర్వాత ఏమైంది? అన్నదే ఈ షార్ట్‌ఫిల్మ్‌ కథాంశం. 99వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం 2027 మార్చిలో జరగనుంది.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)