Breaking News

'విశ్వంభర'తో యుద్ధాన్ని పరిచయం చేసిన మెగాస్టార్‌ (టీజర్‌)

Published on Sat, 10/12/2024 - 10:49

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం  ‘విశ్వంభర’. దసరా సందర్భంగా మెగా అభిమానుల కోసం చిత్ర యూనిట్‌ అదిరిపోయే కానుకను ఇచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష  నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎం.కీరవాణి అందించారు.

చిరంజీవి చరిష్మాటిక్‌ ప్రెజెన్స్ తో  మునుపెన్నడూ లేని ఎక్స్‌పీరియన్స్ ను ప్రేక్షకులకు అందించేలా ‘విశ్వంభర’ టీజర్‌ ఉంది. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో  విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కానీ గేమ్‌ ఛేంజర్‌ అనూహ్యంగా సంక్రాంతి రేసులోకి రావడంతో విశ్వంభర వాయిదా పడుతుంది. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ప్రకటించారు.

బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేలా
భోళా శంకర్‌ డిజాస్టర్‌ తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని విశ్వంభర కథను చిరంజీవి ఎంపిక చేశారు. ఫ్యాన్స్‌ కూడా ఒక భారీ హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తే ఇండస్ట్రీ హిట్‌ కొట్టడం గ్యారెంటీ అనేలా ఉంది. మెగాస్టార్‌ లుక్‌తో పాటు టీజర్‌లో కనిపిస్తున్న విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. దర్శకుడు వశిష్ఠపై చిరంజీవి పెట్టుకున్న నమ్మకాన్ని నిలిబెట్టుకునేలా టీజర్‌ ఉంది. విశ్వంభరతో బాక్సాఫీస్‌ వద్ద మెగా యుద్ధం తప్పకుండా ఉంటుంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)