తంగలాన్‌ సర్‌ప్రైజ్‌ చేస్తుంది

Published on Mon, 08/05/2024 - 03:51

‘‘తంగలాన్ ’ తమిళ సినిమానో, తెలుగు సినిమానో కాదు. ఓ మంచి సినిమా. నా మనసుకు దగ్గరైన సినిమా. ‘తంగలాన్ ’ చూసి ఆడియన్స్ సర్‌ప్రైజ్‌ అవుతారు. ఈ సినిమాలో ఎమోషన్స్, అడ్వెంచర్స్, మెసేజ్‌.. ఇలా చాలా అంశాలు ఉన్నాయి’’ అని విక్రమ్‌ అన్నారు. ఆయన హీరోగా నటించిన పీరియాడికల్‌  యాక్షన్  మూవీ ‘తంగలాన్ ’. పార్వతీ తిరువోతు, మాళవికా మోహనన్  హీరోయిన్స్. 

పా. రంజిత్‌ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్‌ రాజా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘తంగలాన్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విక్రమ్‌ మాట్లాడుతూ–‘‘వందేళ్ల క్రితం జరిగిన కథ ‘తంగలాన్‌’. ‘మద్రాస్‌’ సినిమా నుంచి పా.రంజిత్‌తో వర్క్‌ చేయాలనుకుంటే ‘తంగలాన్ ’తో కుదిరింది. నాకు మంచి రోల్‌ ఇచ్చిన రంజిత్‌కు థ్యాంక్స్‌. జ్ఞానవేల్‌ రాజాగారు బాగా స΄ోర్ట్‌ చేశారు. 

నేను గతంలో నటించిన పాత్రల్ని (శివపుత్రుడు, నాన్న, సేతు, అపరిచితుడు, ఐ..) ఈ వేదికపై చూడగానే భావోద్వేగంగా అనిపించింది. ఇలాంటి విభన్నమైన పాత్రలు ఇంకా చేయాలనే స్ఫూర్తి కలిగింది’’ అన్నారు. పా. రంజిత్‌ మాట్లాడుతూ–‘‘తంగలాన్ ’ రెగ్యులర్‌ మూవీ కాదు. దేశ స్వాతంత్య్రానికి పూర్వం ఉంటుంది. విక్రమ్‌గారు అద్భుతంగా నటించారు. ఆయన దొరకడం నా అదృష్టం. ‘తంగలాన్ ’ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

 ‘‘తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ్రపాణం. ‘తంగలాన్ ’ని స΄ోర్ట్‌ చేయండి. ఆగస్టు 15న విడుదలవుతున్న ‘మిస్టర్‌ బచ్చన్ ’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ‘ఆయ్‌’ వంటి సినిమాలూ విజయాలు సాధించాలి’’ అన్నారు నిర్మాత జ్ఞానవేల్‌ రాజా. ‘‘ఈ చిత్రంలో ‘గంగమ్మ’ పాత్రలో నటించాను. విక్రమ్‌లాంటి కో స్టార్‌ని నేను ఇప్పటి వరకూ చూడలేదు’’ అన్నారు పార్వతి తిరువోతు.

 ‘‘విక్రమ్‌గారితో స్క్రీన్  షేర్‌ చేసుకోవాలనుకున్న నా కల ‘తంగలాన్ ’తో నిజమైంది’’ అన్నారు మాళవికా మోహనన్ . ‘‘ఇదొక అద్భుతమైన మూవీ’’ అన్నారు నటుడు డేనియల్‌. ఈ కార్యక్రమంలో హీరోయిన్  పాయల్‌ రాజ్‌పుత్, స్టూడియోగ్రీన్  ఎగ్జిక్యూటివ్‌ సీఈవో ధనుంజయన్ , నిర్మాతలు ‘మధుర’ శ్రీధర్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, ఎస్‌కేఎన్ , దర్శక–నిర్మాత సాయిరాజేష్, దర్శకుడు కరుణకుమార్, మైత్రీ మూవీస్‌ శశి మాట్లాడారు.

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)