Breaking News

జైలర్‌తో విద్య?

Published on Thu, 05/29/2025 - 06:15

రజనీకాంత్‌ హీరోగా నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్‌ ’(2023) చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జైలర్, రిటైర్డ్‌ జైలర్‌ ముత్తువేల్‌ పాండియన్‌గా రజనీకాంత్‌ నటనకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రజనీ–నెల్సన్‌ కాంబినేషన్‌లోనే ‘జైలర్‌’కి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ చిత్రం రూపొందుతోంది. సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కథాంశం ప్రధానంగా గోవా నేపథ్యంలో ఉంటుందట. 

ఇదిలా ఉంటే.. ‘జైలర్‌ 2’లో విద్యా బాలన్‌ నటించనున్నారని తమిళ ఇండస్ట్రీ టాక్‌. ఇటీవల విద్యా బాలన్‌ని కలిసి, ‘జైలర్‌ 2’ కథ చె΄్పారట నెల్సన్‌. చిత్రకథతో పాటు తన పాత్ర కూడా నచ్చడంతో ఆమె నటించేందుకు పచ్చజెండా ఊపారని సమాచారం. ‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌ భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. ‘జైలర్‌ 2’లోనూ ఆమె అదే పాత్రలో కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాంతో విద్యా బాలన్‌ పాత్ర ఏంటి? అనేది ఆసక్తికరంగా మారింది. 

ఈ విషయంపై స్పష్టత రావాలంటే యూనిట్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడక తప్పదు. ఇదిలా ఉంటే... ‘జైలర్‌ 2’లో హీరో బాలకృష్ణ నటించనున్నారనే వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. తాజాగా హీరో నాగార్జున కూడా ఈ చిత్రంలో  నటించనున్నారనే టాక్‌ నడుస్తోంది. ఇప్పటికే రజనీకాంత్‌ ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ కీలక పాత్ర పోషించారు. మరి... ‘జైలర్‌ 2’లో కూడా నటిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)