amp pages | Sakshi

ఏదో ఒకరోజు సూసైడ్‌ చేసుకుని చచ్చిపోదామనుకున్నా

Published on Thu, 04/07/2022 - 18:27

చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఉర్ఫీ జావెద్‌. ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌ను చూసి మెచ్చుకునేవాళ్లకంటే బుగ్గలు నొక్కుకునేవాళ్లే ఎక్కువ. వెరైటీ డ్రెస్సులతో సోషల్‌ మీడియా సెన్సేషన్‌గా మారిన ఉర్ఫీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మానసిక ఒత్తిడి గురించి మాట్లాడింది. తనను నటిగా కాదు కదా, కనీసం ఫ్యాషన్‌ డిజైనర్‌గా చూసేందుకు కూడా ఇంటిసభ్యులు ఇష్టపడలేదని చెప్పుకొచ్చింది. తనకున్న ప్యాషన్‌ను వదిలేయలేక ఇంటిని వదిలేసి వచ్చానంది. అలా బుల్లితెర ధారావాహికల్లో చిన్నచిన్న పాత్రలు పోషించానంది.

ఈ క్రమంలో కొన్ని సంవత్సరాలపాటు మానసిక వేదనను అనుభవించానంది. ఎప్పటికీ ఇలానే బతకాలా? లేదంటే ఏదో ఒకరోజు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా? అనిపించిందని చెప్తూ బాధపడింది. అలాంటి స్థితి నుంచి బయటపడేందుకు చాలా కాలమే పట్టిందని తెలిపింది. జీవితంలో ఏవైనా అద్భుతాలు జరగాలని కోరుకున్నాను, కానీ పరిస్థితుల వల్ల చిన్న చిన్నపాత్రలు చేయాల్సి వస్తోందని విచారం వ్యక్తం చేసింది ఉర్ఫీ.

తనపై జరిగే ట్రోలింగ్‌ గురించి స్పందిస్తూ.. 'నా ఫొటోలు వైరల్‌ అయినా, ఎవరైనా నా పిక్స్‌ పోస్ట్‌ చేసినా చాలు కొందరు నటీమణులు తెగ ఉడికిపోతుంటారు. వల్గర్‌గా ఉంది, అసహ్యమేస్తోంది అని కామెంట్లు చేస్తుంటారు. అది చూసినప్పుడు అసలు నేను మిమ్మల్ని ఏమన్నానని ఇలా మాట్లాడుతున్నారు? అనిపిస్తుంటుంది. డ్రెస్సింగ్‌ విషయంలో నేనెప్పుడూ బోల్డ్‌గానే ఉంటాను. నన్ను ప్రేమించినా, ద్వేషించినా అస్సలు పట్టించుకోను. మీరు పాజిటివ్‌గా, నెగెటివ్‌గా మాట్లాడినా అది నాకు మంచే చేస్తుంది' సమాధానమిచ్చింది ఉర్ఫీ జావెద్‌.

చదవండి: నన్ను రావణాసురుడితో పోలిస్తే బాగుంటుంది: ఆర్జీవీ

రాఖీభాయ్‌తో విజయ్‌, షాహిద్‌ ఢీ.. ఏప్రిల్‌ 14న ఏం జరగబోతోంది?

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌