హాలీవుడ్‌ దిగ్గజంతో రాజమౌళి.. మైండ్‌ బ్లోయింగ్‌

Published on Sat, 01/14/2023 - 11:28

సాక్షి, సినిమా: దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి బ్లాక్‌బస్టర్‌ పీరియడ్‌ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా ప్రపంచమంతా సాగుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకుంది ఇందులోని నాటు నాటు సాంగ్‌. తద్వారా అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఎంఎం కీరవాణి కంపోజ్‌ చేసిన ఈ సాంగ్‌.. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీతో పాటు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌​ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ బరిలోనూ ఏదైనా అద్భుతం సృష్టిస్తుందా? అని ఎదురు చూస్తున్నారంతా. 

ఈ లోపు రాజమౌళి తన ఫ్యాన్‌ బాయ్‌ ముచ్చటను తీర్చుకున్నాడు. హాలీవుడ్‌ దిగ్గజ ఫిల్మ్‌మేకర్‌ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌(76)ను కలిశాడు. ఐ జస్ట్‌ మెట్‌ గాడ్‌ అంటూ తన భావాన్ని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు ఆయన. మొదటి చిత్రంలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ ఫొటోల్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం ఉన్నారు. జురాసిక్‌ పార్క్‌ లాంటి చిత్రాలతో స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మన దేశంలోనూ పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల వేడుకల సందర్భంలోనే వీళ్ల కలయిక జరిగినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ వెటరన్‌ ఫిల్మ్‌మేకర్‌ ది ఫాబెల్స్‌మ్యాన్‌ చిత్రానికి గానూ బెస్ట్‌ డైరెక్టర్‌(మోషన్‌ పిక్చర్‌)కేటగిరీలో అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం రెండే గంటల్లో జక్కన్న పోస్ట్‌కి మిలియన్‌కి పైగా వ్యూస్‌ రావడం విశేషం.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)