Breaking News

కామెడీ అనుకున్నా.. మాస్‌లా ఉంది

Published on Tue, 08/29/2023 - 03:52

‘‘తిరగబడర సామీ’ కామెడీ సినిమా అనుకున్నా. కానీ, టీజర్‌ చూస్తుంటే ఫుల్‌ మాస్‌ సినిమాలా ఉంది. రాజ్‌ తరుణ్‌ యాక్షన్‌ ఇరగదీసినట్లు కనిపిస్తోంది. రాజ్‌ తరుణ్, రవి కుమార్‌కి ఇది మంచి కమ్‌ బ్యాక్‌ మూవీ అవుతుంది. టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. రాజ్‌ తరుణ్‌ హీరోగా, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్లుగా ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వం వహించిన చిత్రం ‘తిరగబడర సామీ’. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాపై మల్కాపురం శివకుమార్‌ నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని ‘దిల్‌’ రాజు విడుదల చేశారు.

రాజ్‌ తరుణ్‌ మాట్లాడుతూ– ‘‘రవికుమార్‌ చౌదరిగారు ఈ సినిమాతో నాలో కొత్త కోణం (యాక్షన్‌) చూపించారు. సినిమా చాలా బాగా వచ్చింది.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు. ‘‘కొన్నేళ్ల గ్యాప్‌ తర్వాత తెలుగులో నాకు మళ్లీ  పునర్జన్మ ఇచ్చిన శివకుమార్‌గారికి ధన్యవాదాలు’’ అన్నారు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి. ‘‘త్వరలో రిలీజ్‌ కానున్న మా సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్‌. నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు సముద్ర, నటుడు తాగుబోతు రమేష్‌ తదితరులు మాట్లాడారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)