Breaking News

విజయ్‌ తనయుడు హీరోగా ఉప్పెన రీమేక్‌!

Published on Wed, 04/05/2023 - 10:17

తెలుగు చిత్రం ఉప్పెన పేరుకు తగ్గట్టుగానే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త దర్శకుడు, కొత్త హీరో, కొత్త హీరోయిన్‌. అయినా చిత్రం సంచలన విజయం సాధించింది. వర్ధమాన నటుడు వైష్ణవ తేజ్‌ కథానాయకుడిగా పరిచయమైన ఈ చిత్రంలో నటి కృతి శెట్టి నైతిక ఎంట్రీ ఇచ్చింది. నటుడు విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడు పాత్రలో నటించిన ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకుడు. కాగా తాజాగా ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు విజయ్‌ వారసుడు సంజయ్‌ను హీరోగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

సంజయ్‌ బాల నటుడిగా కొన్ని చిత్రాల్లో నటించినా, ప్రస్తుతం దర్శకత్వంపై మక్కువ చూపుతున్నట్లు తెలిసింది. విదేశాల్లో దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన ఈయన ఇప్పటికే షార్ట్‌ ఫిలిమ్స్‌ రూపొందిస్తున్నాడు. త్వరలో ఓ చిత్రానికి దర్శకత్వం వహించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో ఉప్పెన చిత్ర రీమేక్‌లో సంజయ్‌ని హీరోగా నటింప చేయడానికి ఓ ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తున్నట్లు తాజా సమాచారం.

ఆ చిత్రంలో నటించిన కృతి శెట్టినే తమిళంలోనూ ఎంపిక చేయాలని భావిస్తున్నారని సమాచారం. ఈమె ఇప్పటికే ది వారియర్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా టాలీవుడ్‌ నటుడు నాగచైతన్య నటిస్తున్న ద్విభాషా చిత్రం కస్టడీలో కూడా ఈమెనే నాయకి. ఇకపోతే ఉప్పెన చిత్ర రీమేక్‌లో నటించడానికి సంజయ్‌ ఊ అంటాడా? ఊహూ అంటాడా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై స్పష్టత రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)