Breaking News

నా జీవితంలో ఇద్దరు ప్రేమికులన్నారు: హీరోయిన్‌

Published on Sun, 05/04/2025 - 07:29

నటి వేదిక గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక సినీ కవి నటి ఇలియానాను చూసి నడుం ఎక్కడే నీకు నవలామణి అనే పాటను రాశారు. అయితే ఆ పాట నటి వేదికకు సరిగ్గా సరిపోతుంది. ఈమె కూడా అంత స్లిమ్‌గా తన అందాన్ని కాపాడుకుంటారు. ఈమె బహు భాషా కథానాయకి. తమిళం ,తెలుగు, మలయాళం, కన్నడం ,హిందీ మొదలగు భాషల్లో నటిస్తూ పాన్‌ ఇండియా కథానాయకిగా రాణిస్తున్నారు. 

మదరాసి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా పరిచయమైన వేదిక ఆ తర్వాత ముని, చక్కరకట్టి, కాళై, పరదేశి, కావ్య తలైవన్‌, కాంచన 3 తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. తెలుగులో విజయదశమి, బాణం, రూలర్‌, బంగార్రాజు, రజాకార్‌, ఫియర్‌ వంటి మూవీస్‌లో నటించారు. అయితే స్టార్‌ ఇమేజ్‌ కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఈమె కథానాయకిగా నటించిన ఖజానా చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండే బ్యూటీ వయసు జస్ట్‌ 37 ఏళ్లు మాత్రమే. 

దీంతో ప్రేమ, పెళ్లి వంటి విషయాల గురించి అడిగిన ప్రశ్నకు వేదిక బదులిస్తూ తన జీవితంలో ఇద్దరు ప్రేమికులు ఉన్నారని వారు తనతో చివరి వరకు ఉంటారని పేర్కొన్నారు. అందులో ఒకటి తన తల్లి ప్రేమ అని, అది తొలిప్రేమ అని, రెండవది నాట్యం అని చెప్పారు. నాట్యం అంటే తనకు పిచ్చి ప్రేమ అని చెప్పారు. తనకు విరామం దొరికినప్పుడల్లా డాన్స్‌ చేస్తానని చెప్పారు. ఈ రెండు ప్రేమలు తన జీవితంలో చివరి వరకు కొనసాగుతాయని పేర్కొన్నారు. అయితే మగవారిపై ప్రేమ పుట్టదా అన్న ప్రశ్నకు అది కలిగినప్పుడు చూద్దాం అంటూ నటి వేదిక బదులిచ్చారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)