Breaking News

మార్పు రావాలి 

Published on Sat, 10/14/2023 - 00:32

కథానాయికగా సౌత్, నార్త్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తాప్సీ. అయితే హీరోయిన్‌గా మిగిలిపోకుండా నిర్మాతగానూ నిరూపించుకోవాలనుకున్నారామె. తొలి ప్రయత్నంగా తాప్సీ నిర్మించిన హిందీ చిత్రం ‘ధక్‌ ధక్‌’ శుక్రవారం విడుదలైంది. అయితే నిర్మాతగా తనకు చేదు అనుభవం ఎదురైందని తాప్సీ అంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ – ‘‘బాలీవుడ్‌లో స్టార్‌ సిస్టమ్‌ వల్ల చిన్న సినిమాలకు నష్టం జరుగుతోంది.

కథ వినేటప్పుడే ‘హీరో ఎవరు?’ అని అడుగుతున్నారు. దాంతో జనాలు ‘కంటెంటే కింగ్‌’ అనుకుంటారనే నా భ్రమ తొలగిపోయింది. హీరోని బట్టి పెట్టుబడి ఉంటుంది. ఓ నటిగా నేను ఒక కథ వినేటప్పుడు ఆ నిర్మాతలు ఎంత పెద్దవాళ్లు,  కో–స్టార్‌ ఎవరు? అని అడగలేదు. కొత్త దర్శకులతో, కొత్త నటులతో సినిమాలు చేశాను. కానీ వేరేవాళ్లు అలా చేయడానికి ఇష్టపడటంలేదు. ఎందుకీ తేడా? ఈ విషయంలో ఏ ఒక్కర్నో నిందించాల్సిన అవసరం లేదు. యాక్టర్లు, స్టూడియోలు, ప్రేక్షకులు... అందరూ బాధ్యులే. బాలీవుడ్‌ అర్థవంతమైన చిత్రాలు చేయడంలేదని అంటుంటారు.

కానీ, చేసినప్పుడు మాత్రం సపోర్ట్‌ దక్కదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి. పెద్ద సినిమాలకు పెట్టుబడి పెట్టి, డిజిటల్‌ రైట్స్‌ ద్వారా డబ్బు రికవర్‌ చేసుకోవచ్చని అనుకుంటారు. చిన్న సినిమాలకు పెట్టుబడి పెట్టడం కష్టం.. రిలీజ్‌ చేసుకోవడమూ కష్టమే. ఈ పరిస్థితి స్టార్స్‌కి, యాక్టర్స్‌కి మధ్య దూరం పెంచుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇక తాప్సీ ఒక నిర్మాతగా వ్యవహరించిన ‘ధక్‌ ధక్‌’ కథ నలుగురు మహిళల చుట్టూ తిరుగుతుంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)