Breaking News

31 ఏళ్ల నాటి ఫోటో షేర్‌ చేసిన 'విశ్వసుందరి'.. ప్రత్యేకత ఇదే

Published on Wed, 05/21/2025 - 14:07

పద్దెనిమిదేళ్ళ వయసులో విశ్వసుందరి  కిరీటాన్ని కైవసం చేసుకుని భారతదేశ సౌందర్య సౌరభాన్ని ప్రపంచ దేశాలకు  సుస్మితా సేన్( Sushmita Sen) పరిచయం చేశారు. సరిగ్గా 31 ఏళ క్రితం మే 21న విశ్వసుందరి కిరీటాన్ని ఆమె అందుకున్నారు. భారత్‌ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. దీంతో ఆమె పేరు విశ్వవ్యాప్తంగా గుర్తుండిపోయింది. అప్పటి తీపి గుర్తులను ఆమె తాజాగా మరోసారి గుర్తుచేసుకుంటూ ఫోటలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు.

1975, నవంబర్ 19న ఓ బెంగాలీ కుటుంబంలో  జన్మించిన సుస్మితా సేన్ తనకు 18వ ఏట విశ్వసుందరిగా కిరీటం అందుకుని చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. 'ఈ రోజు నా జీవితంలో ఎప్పిటికీ మరిచిపోలేనిది. నా ఆశలకు మరింత బలాన్ని అందించిన రోజు ఇదే.. ప్రపంచమంతా పర్యటించడానికి అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులను కలిసే భాగ్యం పొందడానికి దోహదపడిన రోజు. మిస్‌ యూనివర్స్‌ రేసులో నా భారతదేశం తొలిసారి విజయం సాధించి 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. నా దేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అత్యున్నతమైన గౌరవం నాకు అభించిందని ఎప్పటికీ  గర్వంగా ఉంటుంది. దానిని మాటలలో చెప్పలేం.' అని ఆమె పంచుకున్నారు.

1994లో విశ్వ సుందరి కిరీటం గెలిచి భారత జాతి ఖ్యాతి పెంచిన సుస్మిత.. ఎన్‌జివోలతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా సొంతంగా తనూ కొన్ని సేవా సంస్థలను నిర్వహిస్తోంది. తెలుగులో నాగార్జున సరసన 'రక్షకుడు' చిత్రంలో నటించింది.  ఆ తర్వాత సినిమాలకు కొంత విరామం ఇచ్చి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకుగాను 2013 సంవత్సరానికి సుస్మితాసేన్‌ మదర్‌థెరిస్సా ఇంటర్నేషనల్‌ అవార్డు అందుకున్నారు. సామాజిక న్యాయం కోసం కృషిచేసే వారిని గుర్తించి గౌరవించేందుకు ద హార్మనీ ఫౌండేషన్‌ అనే సంస్థ ఈ అవార్డు నెలకొల్పింది.

#

Tags : 1

Videos

సీఎం రేవంత్ బండారం మొత్తం బయటపడింది: కేటీఆర్

నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు

కేటీఆర్, హరీష్రరావు ఇంటికి వెళ్లి ఈ లేఖ తయారుచేశారు

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత యూనస్ రాజీనామా ?

తమన్నా అవసరమా.. కర్ణాటకలో కొత్త వివాదం

Vijayawada: వల్లభనేని వంశీ విజువల్స్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరికృష్ణకు CI భాస్కర్ చిత్రహింసలు

కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!

MDU Operators: కరోన లాంటి కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి కష్టపడ్డాం..

Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..

Photos

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)