Breaking News

వెండితెర సోగ్గాడు తిరిగొస్తున్నాడు 

Published on Mon, 12/15/2025 - 05:10

‘సోగ్గాడు’ తిరిగొస్తున్నాడు. శోభన్‌బాబు హీరోగా నటించిన సూపర్‌ హిట్‌ సినిమా ‘సోగ్గాడు (1975)’. జయచిత్ర, జయ సుధ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కె. బాపయ్య దర్శకత్వంలో డి. రామానాయుడు నిర్మించారు. 1975 డిసెంబరు 19న ఈ సినిమా విడుదలైంది. ‘సోగ్గాడు’ చిత్రం 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సురేష్‌ ప్రొడక్షన్స్, అభిల భారత శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో స్వర్ణోత్సవం జరగనుంది.

 అదే రోజు సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ సినిమాను రీ రిలీజ్‌ చేయనుంది. ఆదివారం ‘సోగ్గాడు’ సినిమా స్వర్ణోత్సవ కర్టెన్‌ రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేష్‌బాబు మాట్లాడుతూ – ‘‘సోగ్గాడు’ మా సంస్థకు మంచి పేరు, డబ్బు తెచ్చిపెట్టింది. నేటి టెక్నాలజీని ఉపయోగించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్‌ చేయబోతున్నాం. అలాగే మా సంస్థ చిత్రాలను ఏఐలోకి మార్చే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నాం’’ అని చెప్పారు. మురళీ మోహన్‌ మాట్లాడుతూ– ‘‘శోభన్‌బాబుతో నేను ‘ముగ్గురు మిత్రులు’ సినిమా తీశాను’’ అని అన్నారు. ఇంకా పలువురు దర్శక–నిర్మాతలు, అఖిల భారత శోభన్‌బాబు సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)