Breaking News

మీతో జర్నీ అద్భుతం మేడమ్‌

Published on Thu, 06/26/2025 - 06:21

‘‘ప్రియాంకా చోప్రా మేడమ్‌తో పని చేయడం నాకో ప్రత్యేకమైన అనుభవం. ఆమె చాలా తెలివిగలవారు... మంచి చమత్కారి... స్ట్రాంగ్‌ ఉమన్‌ కూడా. అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు’’ అంటూ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ విక్కీ భరత్యా కొనియాడారు. ఇంతకీ ప్రియాంకాతో కలిసి విక్కీ ఏ సినిమా చేశారంటే... మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29’ (వర్కింగ్‌ టైటిల్‌)కి. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్‌ రోల్‌ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సినిమాకి సంబంధించిన ఓ పాటకు విక్కీ నృత్యదర్శకుడిగా పని చేసినట్లుగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయన షేర్‌ చేసిన పోస్ట్‌ స్పష్టం చేస్తోంది. ఈ పాటలో ప్రియాంకా చోప్రా ఎనర్జీ సూపర్‌ అని విక్కీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘డ్యాన్స్‌ రిహార్సల్స్‌ సమయంలో, షూటింగ్‌ అప్పుడు ప్రియాంక కనబరిచిన ఎనర్జీ చాలా స్ఫూర్తిగా ఉంటుంది. తన శాయశక్తులా కృషి చేస్తారామె. ఆమెలో నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే... స్థాయిని బట్టి కాకుండా అందరితోనూ గౌరవంగా ఉంటారు. 

ఒకవైపు హార్డ్‌వర్క్‌ చేస్తూనే మరోవైపు తన చుట్టూ ఉన్న అందర్నీ పట్టించుకుంటారు. నాకు ఆమె మీద అభిమానం, గౌరవం పెరిగిపోయాయి. కళ పట్ల మీరు (ప్రియాంక) కనబరిచే అంకితభావం, ప్రేమ, అందరి పట్ల మీరు చూపించే గౌరవ మర్యాదలకు ధన్యవాదాలు మేడమ్‌. మీతో నా ఈ చిన్ని ప్రయాణం (ఎస్‌ఎస్‌ఎమ్‌బి 29ని ఉద్దేశించి) అద్భుతం. 

ఈ జర్నీలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది’’ అంటూ ప్రియాంకా చోప్రాపై తనకు ఏర్పడిన అభిమానాన్నంతా వ్యక్తపరిచారు విక్కీ భరత్యా. ఇదిలా ఉంటే... ప్రియాంకా చోప్రా  పై చిత్రీకరించిన పాటలో మహేశ్‌బాబు కూడా ఉన్నారా? లేక సోలో పాటనా? అనేది తెలియాల్సి ఉంది. ఇక భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాన్‌ ఇండియా మూవీ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)