భావోద్వేగాల స్పిరిట్‌ 

Published on Thu, 08/06/2026 - 04:06

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియన్‌ మూవీ ‘స్పిరిట్‌’. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ‘యానిమల్‌’ మూవీ ఫేమ్‌ తృప్తీ దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రకాష్‌రాజ్, వివేక్‌ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు. భద్రకాళి పిక్చర్స్‌ ప్రొడక్షన్స్, టీ–సిరీస్‌ బ్యానర్స్‌పై ప్రణయ్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్, కృష్ణన్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసాఫీసర్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పోలీస్‌ అనగానే పవర్‌ఫుల్‌ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుందని అనుకుంటారు. అయితే ఈ సినిమాలో భావోద్వేగాలకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందట. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌ కుమార్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘‘స్పిరిట్‌’ లో తన కెరీర్‌లోనే మోస్ట్‌ ఇంటెన్స్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు ప్రభాస్‌. 

తన మార్క్‌ యాక్షన్, ఎమోషన్స్‌తో అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలా తీర్చిదిద్దుతున్నారు సందీప్‌. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చూశాను. పోలీస్‌ స్టోరీ కథ అయినప్పటికీ కుటుంబ నేపథ్యం, బలమైన భావోద్వేగాలు ఉంటాయి. మునుపెన్నడూ చూడని సినిమా ఇది అని ప్రేక్షకులు భావిస్తారు’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, కన్నడతో పాటు చైనీస్, జపనీస్, కొరియన్‌ సహా మొత్తం 8 భాషల్లో 2027 మార్చి 5న విడుదల కానుంది.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)