తప్పు ఒప్పుకున్న చంద్రబాబు.. ఫైన్ కట్టిన హెరిటేజ్
Breaking News
బరిలోకి దిగుతున్న 'సంక్రాంతి సోగ్గాళ్లు'
Published on Sun, 02/08/2026 - 18:41
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సీక్వెల్‌ను అధికారికంగా అన్నపూర్ణ స్టూడియో ప్రకటించింది. అయితే, పూర్తి క్లారిటీ కాకుండా ఒక పంచ్ డైలాగ్‌తో పోస్ట్ చేశారు. 2016 సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ భారీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 2022 సంక్రాంతికి సీక్వెల్‌గా బంగార్రాజు వచ్చాడు. అయితే, 2027 సంక్రాంతికి మరో సీక్వెల్ రానుందని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. వాసివాడి తస్సాదియ్యా అంటూ.. 2027 జనవరి 15న సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్‌గా ఉంటాది కదా అని డేట్ మార్క్ చేసుకోమని పోస్ట్ చేశారు.
దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే అందరి దృష్టినీ ఆకర్షించి హిట్ కొట్టడమే కాకుండా బంగార్రాజు సీక్వెల్‌తో మెప్పించాడు. దీంతో ఇదే ప్రాంఛైజీలో మరో సినిమా రానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ చేసిన పోస్ట్‌తో ఒక క్లారిటీ ఇచ్చేసింది. కల్యాణ్‌కృష్ణ, నాగార్జున కలిసి పార్ట్-3 ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలో మరిన్ని విషయాలు వెల్లడించే ఛాన్స్ ఉంది. రాబోయే సంక్రాంతికి సీనియర్ హీరోలు అందరూ పోటీలో ఉన్నారు. చిరంజీవి- బాబీ సినిమాతో పాటు బాలకృష్ణ- గోపీచంద్ మలినేని, వెంకటేశ్- అనిల్ రావిపూడి సినిమాలు రేసులో ఉన్న విషయం తెలిసిందే.
వాసివాడి తస్సాదియ్యా 💫✨వచ్చే 15th జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ ఫుల్ గా ఉంటాది కదా💥 🔥🔥 డేట్ మార్క్ చేసుకోండి 🤩
— Annapurna Studios (@AnnapurnaStdios) February 8, 2026
Tags : 1