Breaking News

కుమారుడి కోసం సొంతూరు వెళ్లిన శివ కార్తికేయన్‌

Published on Wed, 02/05/2025 - 08:24

కోలీవుడ్‌ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan) తన  చిన్న కుమారుడి చెవిపోగు వేడుకను సొంత గ్రామంలో ఘనంగా జరిపించారు. శివకార్తికేయన్‌, ఆర్తి దంపతులకు  కూతురు ఆరాధన, కుమారుడు గుగన్‌ ఉన్నారు. గతేడాదిలో మూడోసారి మళ్లీ అబ్బాయే పుట్టాడు. తనకు పవన్‌ అని నామకరణం చేసినట్లు కూడా శివకార్తికేయన్‌ తెలిపాడు. అయితే, తాజాగా తన చిన్న కుమారుడి చెవిపోగు వేడుకను గ్రామస్థులు, అందరి బంధువుల సమక్షంలో జరిపించడం విశేషం. తమ కులదైవ సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని ఆయన జరిపించారు.

శివకార్తికేయన్‌ సొంతూరు తమిళనాడులోని తిరువారూర్ జిల్లా గూడవాసల్ తాలూకాలో ఉన్న తిరువీజిమిలై.. అక్కడే ఈ వేడుకను నిర్వహించారు.  అయితే, శివకార్తికేయన్‌కు వివాహం కాకముందే ఉద్యోగం ఎతుక్కుంటూ చెన్నైకి వచ్చాడు. అలా మొదటిసారి ఒక టీవీ ఛానల్‌లో యాంకర్‌గా చేరి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు. ఆపై తన దగ్గరి బంధువు అయిన ఆర్తిని ఆయన పెళ్లి చేసుకున్నారు. కెరీర్‌ పరంగా ఎంత స్థాయికి వెళ్లినప్పటికీ తన మూలాలను మరిచిపోలేదు. ఇప్పటికీ ఆయనకు  అక్కడ సొంత ఇళ్లు ఉంది. తన  స్వగ్రామంలోని వారి కుటుంబ  ఆరాధ్య దైవం మహా మరియమ్మన్ ఆలయంలో తన బంధువులు, గ్రామస్తుల సమక్షంలో మూడో సంతానమైన మగబిడ్డ చెవిపోగు వేడుకను నిర్వహించారు.

ఆ తర్వాత తన  గ్రామంలో ఉన్న అందరితో పాటు కలిసి భోజనం శివకార్తికేయన్‌ చేశారు. అమరన్‌ సినిమాతో తమ గ్రామానికి మరింత పేరు తీసుకొచ్చావాని  శివకార్తికేయన్‌ను గ్రామస్తులు ప్రశంసించారు. ఆపై ఆయనతో ఫోటోలు దిగారు. ఎన్నో ఏళ్ల తర్వాత తన బంధువులను ఇలా కలవడంతో తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. అప్పుడప్పుడు తమ గ్రామానికి వస్తూ ఉండాలని ఆయనకు బంధువులు సూచించారు. ఇలా కుమారుడి కోసం అయినా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

‘పరాశక్తి’గా శివ కార్తికేయన్‌
శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు.  శివ కార్తికేయన్‌ 25వ చిత్రంగా రానున్నడంతో అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రవి మోహన్, అధర్వ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో రానున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇది వందో చిత్రం కావడం విశేషం.

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)