'పరాశక్తి' కోసం పోటీ పడుతున్న ఇద్దరు హీరోలు

Published on Thu, 01/30/2025 - 00:49

శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘పరాశక్తి’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మరోవైపు విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన సినిమాకి కూడా ‘పరాశక్తి’ టైటిల్‌ ఖరారు చేయడం విశేషం. శివ కార్తికేయన్‌ హీరోగా రూపొందుతోన్న ‘పరాశక్తి’కి సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. 

రవి మోహన్, అథర్వ, శ్రీలీల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆకాశ్‌ భాస్కరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘సైన్యమై కదిలిరా... పెను సైన్యమై కదిలిరా...’ అంటూ శివ కార్తికేయన్‌ చెప్పే డైలాగులు టీజర్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో ఆయన విద్యార్థి సంఘం నాయకుడుగా కనిపించనున్నారని తెలుస్తోంది.  

→ విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన ‘పరాశక్తి’ చిత్రానికి అరుణ్‌ ప్రభు దర్శకత్వం వహించారు. మీరా విజయ్‌ ఆంటోనీ సమర్పణలో విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్స్‌ కార్పొరేషన్‌ పై ‘పరాశక్తి’రూపొందింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ‘‘విభిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)