Breaking News

సింగర్‌ జయచంద్రన్ మృతి

Published on Fri, 01/10/2025 - 05:00

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ (80) ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళలోని త్రిసూర్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, గురువారం తుది శ్వాస విడిచారు. 1944 మార్చి 3న కొచ్చిలో జన్మించిన జయచంద్రన్  1965లో వచ్చిన ‘కుంజలి మరక్కర్‌’ అనే సినిమాలోని ‘ఒరు ముల్లప్పుమలమే..’పాటతో గాయకుడిగా పరిచయమయ్యారు. 1967లో విడుదలైన ‘కలితోజన్‌’ చిత్రంలోని ‘మంజలైల్‌ ముంగి తోర్తి’పాట ఆయన కెరీర్‌లో ఒక మైలురాయి. ఆరు దశాబ్దాలకుపైగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 16 వేలకుపైగాపాటలుపాడారాయన.

జయచంద్రన్‌ తెలుగులోపాడిన‘రోజావే చిన్ని రోజావే (సూర్యవంశం), అనగనగా ఆకాశం ఉంది (నువ్వే కావాలి), హ్యాపీ హ్యాపీ బర్త్‌డేలు (సుస్వాగతం)’ వంటిపాటలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. 2002లో వచ్చిన ‘ఊరు మనదిరా’లోపాడిన ‘నా చెల్లి చంద్రమ్మ’ తెలుగులో ఆయన చివరిపాట. ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్ , ఎం.ఎం. కీరవాణి, విద్యాసాగర్, కోటి వంటి సంగీత దర్శకుల సినిమాలకు ఆయన ఎక్కువగాపాటలుపాడారు. హిందీలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ‘అదా: ఎ వే ఆఫ్‌ లైఫ్‌’ అనే ఒకే ఒక మూవీలోపాడారు జయచంద్ర.

అదేవిధంగా తన మాతృ భాష  మలయాళంలో ‘నఖక్ష తంగళ్‌’, ‘త్రివేండ్రం లాడ్జ్‌’ వంటి సినిమాల్లో అతిథిపాత్రల్లో మెరిశారాయన. అంతేకాదు.. ‘శ్రీ నారాయణ గురు’ అనే మలయాళ సినిమా లోని ‘శివ శంకరా సర్వ శరణ్య విభో..’పాటకుగానూ ‘బెస్ట్‌ మేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌’గా 1986లో జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఐదు కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు, రెండు తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు కూడా ఆయన్ని వరించాయి. జయచంద్రన్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత దర్శకులు, గాయకులు సంతాపం తెలిపారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)