Breaking News

న్యాయం చేయండి.. తప్పు చేస్తే శిక్షించండి.. సజ్జనార్‌తో మంగ్లీ

Published on Tue, 04/14/2026 - 11:01

ప్రముఖ సింగర్‌ మంగ్లీ, న్యాయవాది సుబ్బారావు వివాదం అనేక మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తాజాగా CP సజ్జనార్‌ను కలిశారు. ఇదే కేసులో పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటికే హైడ్రామా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మైక్రోఫైనాన్స్‌ పేరుతో మంగ్లీ, ఆమె తమ్ముడు మోసం చేశారంటూ న్యాయవాది సుబ్బారావు   భాధితులతో కలిసి ఆధారాలు సమర్పించేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. తన మాటతీరు చూసి  పోలీసులు ఆల్కహాల్‌ టెస్ట్‌ నిర్వహించారు. సుబ్బుకు 27 రీడింగ్‌ రావడంతో  అందరూ షాక్‌ అయ్యారు.

మైక్రోఫైనాన్స్‌ పేరుతో తాను డబ్బులు వసూలు చేశానని న్యాయవాది సింగపోగు సుబ్బు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని   మంగ్లీ ఇప్పటికే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తెలిపారు. ఆయన చెప్పిన దానిలో వాస్తవం ఉంటే అధారాలు చూపించాలని కోరారు. ఈ క్రమంలోనే తాజాగా  CP సజ్జనార్‌ను ఆమె కలిశారు.  ఎలాంటి ఆధారాలు లేకుండానే తన మీద   దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని, అందకు కారణమైన అడ్వకేట్‌ సుబ్బరావ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అదే సమయంలో  మైక్రోఫైనాన్స్‌ పేరుతో మోసపోయిన బాధితులకి న్యాయంచేయాలని కోరింది. డబ్బు కాజేసిన అసలు వ్యక్తులను పట్టుకోవాలని మంగ్లీ కోరడంతో నెటిజన్లు కూడా  ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు.

నాకు ఎలాంటి వ్యాపారం లేదు
తనకు పాటల ప్రపంచం పాటలు తప్ప వేరే వ్యాపారం లేదని మంగ్లీ తెలిపారు. న్యాయవాది అని చెప్పుకునే సింగపోగు సుబ్బు డబ్బు డిమాండ్‌ చేయడమే కాకుండా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అతడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని సత్యవతి ముడావత్‌ అలియాస్‌ మంగ్లీ పంజగుట్ట పోలీసులకు  తన న్యాయవాదితో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పేరు చెప్పుకొని ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. డబ్బుల వసూలులో తన పాత్ర ఉందంటే తాను ఏ పోలీస్, కోర్టు మెట్లు ఎక్కేందుకైనా సిద్ధమే అన్నారు. 

డబ్బుల కట్టలు ఉన్న వీడియోలో డబ్బు లెక్కపెట్టేది తన సోదరుడు కాదని, అనవసరంగా అతన్ని ప్రచారం చేస్తున్నారని అన్నారు. న్యాయవాది సుబ్బుకు భరతనాట్యం వస్తుందని, అతను బిగ్‌బాస్‌ వెళ్లాలని, ఫేమస్‌ కావాలని ఇప్పటికే ఫేమస్‌గా ఉన్న తనను వాడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 22వ తేదీన న్యాయవాది సుబ్బు అతని అనుచరులు తనను కలిసి సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చిన వీడియోలు డిలీట్‌ చేయాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో తనను బెదిరించడం, వేధించడం చేశారన్నారు.

Videos

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

అంబేద్కర్ కు వైఎస్ జగన్ నివాళి

తండ్రి కొడుకులపై కుతకుత లాడిన అచ్చెన్నాయుడు

ఇదెక్కడి ఫ్రెండ్లీ పోలీసింగ్..? ఆత్మహత్య చేసుకున్న శివ కార్తికేయ

దళిత మహిళపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే రాజు

100 ఏళ్లలో ఎపుడు చూడని ఎండ, ఆ రెండు గంటలు బయటికి రాకండి

నాడు రక్షణ వలయం.. నేడు ప్రైవేటు నిలయం

ఇరాన్ అమెరికా రెండో విడత శాంతి చర్చ

Photos

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)