ఆ విషయంలో నేను లక్కీ

Published on Tue, 05/09/2023 - 04:14

‘‘పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు, సంగీతం కూడా చాలా ముఖ్యం. కానీ, ప్రస్తుతం ఎంతోమంది తల్లిదండ్రులు కేవలం చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పిల్లల్ని చదువుతోపాటు సంగీతం, ఆటపాటల్లోనూప్రోత్సహించాలని చెప్పే చిత్రమే ‘మ్యూజిక్‌ స్కూల్‌’’ అన్నారు శ్రియ.పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మ్యూజిక్‌ స్కూల్‌’.

► శ్రియ, శర్మాన్  జోషి, షాన్‌ ప్రధానపాత్రల్లో నటించారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగులో ‘దిల్‌’ రాజు, హిందీలో ‘పీవీఆర్‌’ సినిమాస్‌ ‘మ్యూజిక్‌ స్కూల్‌’ని రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం విలేకరుల సమావేశంలో శ్రియ చెప్పిన విశేషాలు.

► ఐఏఎస్‌గా ఉన్నత స్థానంలో ఉన్నపాపారావుగారు సినిమాపై ΄్యాషన్‌తో ఐదారు కథలు సిద్ధం చేసుకున్నారు. వాటిలో ‘మ్యూజిక్‌ స్కూల్‌’ ఒకటి. ఈ కథ వినగానే ఎగై్జటింగ్‌గా అనిపించడంతో నటించేందుకు ఓకే చె΄్పాను. ‘సంతోషం’ చిత్రంలో నేను సంగీతం నేర్చుకునే స్టూడెంట్‌గా చేశా. ‘మ్యూజిక్‌ స్కూల్‌’లో సంగీతం నేర్పించే టీచర్‌పాత్ర నాది.

► పిల్లల్లో ఉండే ప్రతిభని తల్లితండ్రులు గుర్తించి,ప్రోత్సహించాలి. ఆ విషయంలో నేను లక్కీ. మా తల్లితండ్రులు ఏ విషయంలోనూ నాకు అడ్డు చెప్పకుండాప్రోత్సహించారు. మా అమ్మాయి రాధను కూడా చదువుతోపాటు సంగీతం, డ్యాన్స్, ఆటల్లో ప్రోత్సహిస్తాను.పాపారావుగారు ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఈ సినిమాకి ఇళయరాజాగారి సంగీతం హైలైట్‌. ∙‘ఇష్టం’ (2001) సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాను. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎంతోమంది దర్శకులతో పనిచేశా.. ఎన్నో వైవిధ్యమైనపాత్రలు చేశా.. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను చేసే ప్రతిపాత్ర డ్రీమ్‌ రోల్‌లాంటిదే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం షూటింగ్‌లో ఐదురోజులు మాత్రమేపాల్గొన్నాను. నాపాత్ర నిడివి తక్కువే అయినా ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి క్యారెక్టర్‌ను సవాలుగా తీసుకుని చేస్తాను. ప్రస్తుతం రెండు కొత్త సినిమాల్లో నటిస్తున్నాను.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)