Breaking News

స్టార్‌ హీరోతో ఛాన్స్‌.. మరోసారి ఐటమ్‌ సాంగ్‌లో శ్రియ

Published on Tue, 02/04/2025 - 07:01

సాధారణంగా భారీ చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చోటు చేసుకోవడం పరిపారిటిగా మారింది. ముఖ్యంగా స్టార్‌ హీరోల చిత్రాల్లో ప్రముఖ హీరోయిన్లు ప్రత్యేక పాటల్లో నటించడానికి వెనుకాడడం లేదు. అలాంటి పాటల్లో నటించడం వల్ల భారీ పారితోషికం ముడుతుండటం, పేరు రావడమే అందుకు కారణం. ఇకపోతే ఐటమ్‌ సాంగ్స్‌ చిత్రాలకు అదనపు ఆకర్షణగా మారుతున్నాయి. అలా నటి శ్రియ(Shriya Saran ) కూడా ఇంతకు ముందు ఐటమ్‌ సాంగ్స్‌లో నటించారు. కాగా తాజాగా మరోసారి అలాంటి సాంగ్‌తో యువకులను అలరించడానికి సిద్ధమయ్యారు. 

నటుడు సూర్య(Suriya) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో రెట్రో ఒకటి. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించారు. ఈయన చిత్రాల్లో కమర్షియల్‌ అంశాలకు కొదవ ఉండదన్న విషయం తెలిసిందే. అలా రెట్రో చిత్రాన్ని పూర్తిగా కమర్షియల్‌ అంశాలతో యాక్షన్‌ ఎంటర్‌టెయినర్‌గా రూపొందించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకపుకుంటోంది. సంతోష్‌నారాయణన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా మే నెలలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. 

ఇందులో నటి శ్రియ ప్రత్యేక పాటలో నటించడం విశేషం. నటుడు సూర్యతో కలిసి ఆమె నటించిన ఈ పాటను ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా నటుడు సూర్య ప్రస్తుతం నటుడు ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో తన 45వ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ రెండవ షెడ్యూల్‌ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)