Breaking News

నాటు నాటుకు డ్యాన్స్‌ చేశా!

Published on Thu, 01/12/2023 - 00:34

షారుక్‌ ఖాన్, దీపికా పదుకోన్‌ జంటగా నటించిన చిత్రం ‘పఠాన్‌’. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ హిందీ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. కాగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు హీరో రామ్‌చరణ్‌. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో తనదైన స్టైల్‌లో రామ్‌చరణ్‌కి కృతజ్ఞతలు చెప్పారు షారుక్‌ ఖాన్‌. ‘‘థ్యాంక్యూ సో మచ్‌. నా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌.

మీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ ఆస్కార్‌ అవార్డును ఇండియాకు తీసుకొచ్చినప్పుడు దయచేసి నన్ను తాకనివ్వండి.. లవ్యూ’’ అని ట్వీట్‌ చేశారు షారుక్‌. ‘‘తప్పకుండా ఎస్‌ఆర్‌కే సార్‌. ఈ అవార్డు ఇండియన్‌ సినిమాకు చెందింది’’ అని పోస్ట్‌ చేశారు చరణ్‌. కాగా ‘నాటు నాటు..’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించడం పట్ల షారుక్‌ ఖాన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఉదయం వార్త తెలిసిన వెంటనే ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్‌ చేశానని ట్విట్టర్‌లో వెల్లడించారు. భారత్‌ను గర్వపడేలా చేశారని ప్రశంసించారు.

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)