Breaking News

షారుక్-నయన్.. కొత్త పాట

Published on Sun, 08/13/2023 - 06:17

‘ఛలోనా..’ (పద) అంటూ షారుక్‌ ఖాన్, నయనతార ప్రేమ పాట పాడుకోనున్నారు. షారుక్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌లో నయనతార కథానాయికగా నటించిన చిత్రం ‘జవాన్‌’. ఇప్పటివరకూ ఈ చిత్రం నుంచి విడుదలైన షారుక్, నయనతార లుక్స్‌ యాక్షన్‌ సీన్స్‌కి సంబంధించినవి. అలాగే పాటల విషయానికి వస్తే..  షారుక్, ప్రియమణి, డ్యాన్సర్స్‌పై చిత్రీకరించిన మాస్‌ సాంగ్‌ ‘దుమ్మే దులిపేలా..’ ఇటీవల విడుదలైంది.

సోమవారం షారుక్, నయనతారల రొమాంటిక్‌ సాంగ్‌ని, ΄పోస్టర్‌ని విడుదల చేయనున్నారు. ‘ఛలోనా..’ అంటూ సాగే ఈ పాట షారుక్‌ కెరీర్‌లోని బెస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్స్‌లో ఒకటి అవుతుందని యూనిట్‌ పేర్కొంది. అనిరుధ్‌ రవిచందర్‌ స్వరపరచిన ఈ పాటను ఆదిత్య ఆర్‌.కె., ప్రియా మాలి పాడారు. ‘ఛలోనా..’ని హిందీ, తెలుగు, తమిళంలో విడుదల చేయనున్నారు. అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్‌ నిర్మించిన ‘జవాన్‌’ సెప్టెంబర్‌ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)