Breaking News

నా సినిమాల్లో దేశభక్తి అలా కుదురుతోంది!

Published on Sat, 05/13/2023 - 04:11

‘‘ఇండియన్‌ ఇంటెలిజెన్సీ బ్యూరో ప్రతినిధులు పాకిస్తాన్‌ వెళ్లి అక్కడ ఓ స్పై ఆపరేషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్‌ చేశారు. ఈ మిషన్‌ సక్సెస్‌ఫుల్‌ కావడం వల్ల వేలాదిమంది భారతీయుల ప్రాణాలు రక్షించబడ్డాయి. ఈ మిషన్‌ తాలూకు విషయాలను తెలుసుకోవాలంటే ‘ఐబీ 71’ సినిమా చూడాలి. ఓ చారిత్రాత్మక ఘటనతో తీసిన ఈ చిత్రంలో దేశభక్తి తాలూకు మూమెంట్ప్‌ ఉంటాయి’’ అన్నారు దర్శకుడు సంకల్ప్‌రెడ్డి.

విద్యుత్‌ జమాల్‌ హీరోగా నటించి, నిర్మించిన హిందీ థ్రిల్లర్‌ ‘ఐబీ 71’. అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు సంకల్ప్‌రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సంకల్ప్‌మాట్లాడుతూ– ‘‘ఘాజీ’ ఇన్సిడెంట్‌కు ముందు కశ్మీర్‌లో జరిగిన ఓ ఘటన ఆధారంగా తీసిన చిత్రమే ‘ఐబీ 71’. ‘ఘాజీ’, ‘రాజీ’, ఇప్పుడు ఈ ‘ఐబీ 71’.. ఇవన్నీ ఇండియా–పాకిస్తాన్‌ (1971) యుద్ధానికి ముందు జరిగిన ఘటనల నేపథ్యంలో వచ్చిన సినిమాలు.

ఈ ఘటల తాలుకూ విషయాలు అప్పట్లో  న్యూస్‌పేపర్స్‌లో ప్రచురితమయ్యాయి. ఆ సమాచారం ఆధారంగా,  కొత్తమంది వ్యక్తుల ద్వారా కొన్ని కొత్త విషయాలు తెలిశాయి. ‘ఘాజీ’, ‘అంతరిక్షం’, ఇప్పుడు ‘ఐబీ 71’ కథల్లో భాగంగానే దేశభక్తి అంశం మిళితమై ఉంది. అంతేకానీ ప్రత్యేకంగా దేశభక్తి నేపథ్యాల్లో చేయాలని నేనీ సినిమాలు చేయలేదు. అలా కుదురుతోంది.. అంతే. బహుశా అంతర్లీనంగా నాలో ఉన్న దేశభక్తి ఓ కారణమేమో! హిందీలో నాకు ‘ఐబీ 71’ తొలి సినిమా. తెలుగులో నా తొలి సినిమా ‘ఘాజీ’ అండర్‌వాటర్‌ బ్యాక్‌డ్రాప్, రెండో సినిమా ‘అంతరిక్షం’ స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటాయి. ‘ఐబీ 71’ బ్యాక్‌డ్రాప్‌ ఆకాశం. అలాగే భూమి, నిప్పుల బ్యాక్‌డ్రాప్‌లో కూడా సినిమాలు చేయాలని ఉంది’’ అని అన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)