amp pages | Sakshi

చై-సామ్‌ విడాకులు: సమంతకు భరణం ఎన్ని కోట్లు ఉంటుందంటే..!

Published on Sat, 10/02/2021 - 20:40

టాలీవుడ్‌ రొమాంటిక్‌ కపుల్‌ సమంత-నాగ చైతన్య విడాకుల విషయం పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది. శనివారం(అక్టోబర్‌ 2) మేము.. విడిపోతున్నాం అంటూ చై-సామ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తమ అభిమాన జంట విడిపోతున్న విషయాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే వారు ఈ నిర్ణయం తీసుకోవడం వెనకగా కారణలు ఏంటీ? వారు ఎందుకు విడిపోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. అలాగే విడాకుల అనంతరం చై, సమంతకు ఇచ్చే భరణం అంశం కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

చదవండి: సోషల్‌ మీడియా వేదికగా భావోద్వేగానికి లోనైన సమంత, పోస్ట్‌ వైరల్‌

ఫ్యామిలీ మ్యాన్‌ 2లో పలు అభ్యంతరకర సన్నివేశాల్లో సమంత నటించిన కారణంగానే చై-సామ్‌ మధ్య చెడిందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య తరచూ గొడవలు, విభేదాలు తలెత్తడంతో వారిని ఫ్యామిలీ కోర్టుకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ కూడా ఇప్పించారట. అప్పుడు వారి మధ్య మనస్పర్థలు తొలిగినప్పటికీ కొద్ది రోజులు మళ్లీ గొడవలు మొదలైయ్యేవని, దీంతో పలుమార్లు వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చినట్లు సమాచారం. అంతేగాక అందరూ కలిసి వారికి నచ్చజెప్పి ఒకటి చేసే ప్రయత్నం కూడా చేశారట. అయినప్పటికి ఫలితం లేకపోవడంతో చివరికి ఇలా ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో విడాకుల అనంతరం నాగ చైతన్య ఇచ్చే భరణం ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది.

చదవండి: ChaySam Divorce Reason: సమంత-నాగ చైతన్య విడిపోవడానికి కారణాలివేనా?

ఈ విడాకుల ప్రాసెస్‌లో భాగంగా అక్కినేని స్థిర, చర ఆస్తులను చూస్తుంటే సమంతకు భరణం కింద రూ. 250 కోట్ల రూపాయల నుంచి రూ. 300 కోట్ల వరకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఊహగానాలు వస్తున్నాయి. కొందరూ మాత్రం రూ. 50 కోట్ల  ఇచ్చే అవకాశం ఉందని అంటుండగా..మరికొందరెమో సమంత ఒక స్టార్‌ హీరోయిన్‌, ఇప్పటికే ఆమె ఎన్నో స్థిర, చర ఆస్తులను సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. అలాంటి సామ్‌కు భరణం తీసుకునే అవసరం లేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరి చై నుంచి సామ్‌ భరణం తీసుకుంటుందా లేదా? అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎంతవరకు భరణం ఇస్తుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌