Breaking News

సల్మాన్‌ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్‌.. పోలీసుల నిర్ణయం

Published on Mon, 08/01/2022 - 20:31

Salman Khan Gets Arms License After His Request Citing Death Threats: బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు తాజాగా తుపాకీ లైసెన్స్‌ మంజూరైంది. ఇటీవల సల్లూ భాయ్‌ని, అతని తండ్రి సలీం ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్ బిష్ణోయ్‌ బెదిరించిన విషయం తెలిసిందే. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే పడుతుందని సల్లూ భాయ్‌కు వచ్చిన లేఖ నేపథ్యంలో ముంబయి పోలీసులను సల్మాన్‌ ఆశ్రయించాడు. తనకు, తన కుటుంబానికి వస్తున్న చావు బెదిరింపుల కారణంగా తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేయాలని పోలీసులకు సల్మాన్‌ ఖాన్‌ విన్నవించుకున్నాడు. 

ఈ విషయంపై విచారించిన తర్వాత సల్మాన్‌కు తుపాకీ లైసెన్స్‌ను మంజూరు చేస్తూ ముంబయి కమిషనర్‌ వివేక్‌ ఫన్‌ సల్కార్‌ నిర్ణయం తీసుకున్నారు. అయితే సల్లూ భాయ్‌కు తుపాకీ లైసెన్స్‌ జారీ చేసిన ఆతను ఎలాంటి తుపాకీ కొంటారనేది పేర్కొనలేదు. ఆయన రక్షణ కోసం 32 కాలిబర్‌ రివాల్వర్‌ లేదా పిస్టల్‌ను కొనుగోలు చేయాల్సిందిగా ఆయుధ నిపుణులు సూచించినట్లు సమాచారం. కాగా బిష్ణోయ్‌ గ్యాంగ్ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

చదవండి: నాపై విష ప్రచారం, బాధగా ఉంది.. అమీర్‌ ఖాన్‌ ఆవేదన
బికినీలో గ్లామర్‌ ఒలకబోస్తున్న హీరోయిన్‌ వేదిక..


ఇటీవల తెలుగు సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్‌ వచ్చిన సల్మాన్‌ ఖాన్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో బస చేయడంతో భారీ బందోబస్తు ఉంచారు. హోటల్‌లోని ఒక ఫ్లోర్ మొత్తాన్ని సల్మాన్‌కు కేటాయించారు. షూటింగ్‌ల కోసం నగరాల్లో తిరిగేందుకు సల్మాన్‌ కారుకు ముందు వెనుక ఎస్కార్టు ఏర్పాటు చేశారు. అలాగే సల్మాన్ ఖాన్‌ ముందు జాగ్రత్తగా తన ల్యాండ్ క్రూయిజర్‌‌ను బుల్లెట్ ప్రూఫ్ చేయించారు.  

చదవండి: భార్య ప్రణతితో జూనియర్‌ ఎన్టీఆర్‌ కబుర్లు.. ఫొటో వైరల్‌
నాలుగు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లోకి సినిమా..

Videos

YSR విగ్రహానికి ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించడంతో అక్రమ కేసులు

Manohar: కోర్టు తీర్పులను ఉల్లంఘించిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం

Khammam: ఏవో తాజుద్దీన్ హామీతో ధర్నాను విరమించిన రైతులు

ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు DAలు పెండింగ్ లో ఉన్నాయి: హరీశ్ రావు

ఆరావళి పాత తీర్పుపై.. సుప్రీం స్టే..

బోగస్ మాటలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టండి: వైఎస్ అవినాష్రెడ్డి

ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం లేదు: బీర్ల ఐలయ్య

అమెరికాలో తెలంగాణ స్టూడెంట్స్ మృతి

ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..

మా నాయకుడు జగన్ అని గర్వంగా చెప్తాం రాచమల్లు గూస్ బంప్స్ కామెంట్స్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)

+5

'జన నాయగణ్' ఈవెంట్ కోసం పూజా రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (డిసెంబర్ 28- జనవరి 04)