Breaking News

సుమతి పాత్రలో..? 

Published on Thu, 01/29/2026 - 05:27

‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో సాయిపల్లవి నటించనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలజీ సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకోన్, కమల్‌హాసన్‌ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్‌ నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్‌ 27న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

 ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజైనప్పుడే ఈ చిత్రం సీక్వెల్‌ ‘కల్కి 2898 ఏడీ 2’ను మేకర్స్‌ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో దీపికా పదుకోన్‌ నటించడం లేదని, ఇటీవల ఓ సందర్భంలో మేకర్స్‌ అధికారికంగా వెల్లడించారు. దీంతో కథలో కీలకమైన సుమతి (దీపిక క్యారెక్టర్‌) పాత్రలో ఎవరు నటించనున్నారనే చర్చ కొన్ని రోజులుగా ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోంది. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా తదితర కథనాయికల పేర్లు వినిపించాయి.

 తాజాగా సాయిపల్లవి పేరు తెరపైకి వచ్చింది. మంచి ఎమోషనల్‌ డెప్త్‌ ఉన్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలోని సుమతి పాత్రలో దక్షిణాదికి బాగా సుపరిచితురాలైన సాయిపల్లవి నటిస్తే బాగుటుందని మేకర్స్‌ భావిస్తున్నారట. మరి... ‘కల్కి 2’లో సాయిపల్లవి భాగం అవుతారా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ. మరోవైపు ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమవుతుందని, ప్రభాస్‌ కూడా పాల్గొంటారని భోగట్టా. ఈ సీక్వెల్‌ని వచ్చే ఏడాది రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)