Breaking News

విజయ్‌ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి

Published on Mon, 02/24/2025 - 09:25

తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) సినీ కార్మికుల కోసం కొత్తగా ఇల్లు నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తుంది. చెన్నై పక్కనే ఉన్న పాయనూరులో వారి కోసం తమిళనాడు ప్రభుత్వం 100 ఎకరాల భూమిని జారీ చేసిందని సౌత్ ఇండియన్ ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, దర్శకులు ఆర్కే సెల్వమణి తెలిపారు.

సినీ కార్మికులకు నటుడు విజయ్‌ సేతుపతి చేసిన సాయం గురించి ఆర్కే సెల్వమణి తెలిపారు. 'దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో మూడేళ్లలోగా భూమి ఇచ్చి ఇళ్లు కట్టించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, పరిపాలన మారడం తదితర కారణాలతో నివాసాలు నిర్మించుకోలేకపోయారు. నా నేతృత్వంలో ఈ పెప్సీ  ఏర్పాటైన తర్వాత అపార్ట్‌మెంట్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశాం. 

ఎం.కె.స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ భూమిని మళ్లీ నివాసాలకు వినియోగించాలని కోరాం. అధికారులు, మంత్రులందరినీ సంప్రదించిన తర్వాత ఇల్లు నిర్మించుకునేందుకు ఉత్తర్వులు వచ్చాయి.  నిరాశ్రయులైన మన కార్మికుల కోసం తొలిదశలో 1,000 ఇళ్లు నిర్మించనున్నాం.  గృహ నిర్మాణానికి డబ్బు కావాలి. ఇల్లు కావాల్సిన వారు కనీసం 2.5 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

అయితే, ఈ డబ్బు కూడా చెల్లించలేని కార్మికుల కోసం మేము చాలా మంది ప్రముఖులకు విజ్ఞప్తి చేశాము. ఈ క్రమంలో నటుడు విజయ్ సేతుపతి కోటి 30 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. ఈ డబ్బు సుమారు 50 కుటుంబాలకు ఉపయోగపడుతుంది. ఆయన సాయం ఎప్పటికీ మరిచిపోలేం. అందుకే ఈ భూమిలో నిర్మించనున్న 6 టవర్లలో ఒకదానికి విజయ్ సేతుపతి పేరు పెట్టబోతున్నాం. తమిళ పరిశ్రమలో డబ్బున్న సెలబ్రిటీలు అందరూ కూడా పేద కార్మికుల కోసం చేతనైనంత సాయం చేయాలి.' అని ఆయన కోరారు. 

ఫిల్మ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (ఎఫ్‌ఈఎఫ్‌ఎస్‌ఐ) విషయానికి వస్తే.. కోలీవుడ్‌లో 23 విభాగాలకు చెందిన దాదాపు 30 వేల మంది సభ్యులతో ఈ సంస్థ  కొనసాగుతోంది. తమిళ నటీనటుల సంక్షేమం కోసం ఈ సంస్థ పాటుపడుతుంది.  దీని ఏర్పాటులో దర్శకులు ఆర్కే సెల్వమణిదే కీలక పాత్ర కావడం విశేషం. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)