Breaking News

కాంతార ఛాప్టర్-1.. క్లైమాక్స్ సీన్‌ కోసం ఇంతలా కష్టపడ్డారా?

Published on Mon, 10/13/2025 - 16:02

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే బిగ్ హిట్ సినిమాలను దాటేసింది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే కూలీ, సైయారా, వార్-2 లాంటి సూపర్ హిట్స్‌ను సైతం దాటేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.‍ కాంతార చాప్టర్-1  అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా గురించి రిషబ్ శెట్టి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ కోసం తాను పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  క్లైమాక్స్ సీన్ షూటింగ్ సమయంలో తన కాలికి వాపు వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చాలా అలసిపోయాయని రిషబ్ వెల్లడించారు . కానీ ఈ రోజు మా సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే క్లైమాక్స్ లక్షలాది మంది అభిమానం ముందు నా కష్టమంతా చిన్నబోయిందని తెలిపారు. ఇదంతా మేము విశ్వసించే దైవిక శక్తి ఆశీర్వాదం ద్వారా మాత్రమే సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా.. కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ సీక్వెన్స్ ఇప్పటివరకు  అత్యంత  పవర్‌ఫుల్ సన్నివేశాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగాయ.. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్‌లో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా..అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు. 

#

Tags : 1

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)