Breaking News

Allu Arjun Arrest: అల్లు అర్జున్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌

Published on Fri, 12/13/2024 - 16:27

హీరో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. బన్నీ అరెస్ట్‌పై సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి భర్త  స్పందించాడు.  ఈ ఘటనకు అల్లు అర్జున్‌కు సంబంధం లేదు. ‘అల్లు అర్జున్‌ అరెస్టయిన విషయం టీవీల్లో చూసి తెలుసుకున్నాను. నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు. నాకు పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. సినిమా చూస్తానంటేనే నా భార్య, కొడుకును థియేటర్‌కి తీసుకెళ్లాను. అందులో అల్లు అర్జున్‌ తప్పేమి లేదు. అవసరం అయితే కేసును ఉపసంహరించుకుంటాను’ అని రేవతి భర్త అన్నారు.

కాగా,  సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసిన చిక్కడ పల్లి పోలీసులు.. అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు తీవ్రత దృష్ట్యా నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో, పోలీసులు అతన్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.

	Revathi Husband: నా భార్య మృతికి బన్నీకి ఎలాంటి సంబంధం లేదు.

అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్‌డేట్స్‌ కోసం క్లిక్ చేయండి

అసలేం జరిగింది
అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం పుష్ప 2  ఈ నెల 5న విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్‌కి ఒక్క రోజు ముందు డిసెంబర్‌ 4న ఈ సినిమా స్పెషల్‌ ప్రీమియర్స్‌ వేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో ఉన్న సంధ్య థియేటర్‌లో సినిమా చూసేందుకు రేవతి అనే మహిళ తన కుమారుడితో కలిసి వెళ్లింది. అదే థియేటర్స్‌కి అల్లు అర్జున్‌ కూడా వెళ్లాడు. దీంతో బన్నీని చూసేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది. ఈ కేసు విషయంలోనే పోలీసులు బన్నీని అరెస్ట్‌ చేశారు. 

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)