Breaking News

ఓటీటీలో రెట్రో.. ప్రకటన వచ్చేసింది

Published on Mon, 05/26/2025 - 09:07

సూర్య హిట్‌ సినిమా రెట్రో(Retro) ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. సూర్య(Suriya) కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా రెట్రో రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం  సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చినా రెట్రో మాత్రం  ఆ లోటును తీర్చింది. అయితే, తెలుగులో అంతగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో రొమాంటిక్‌ యాక్షన్‌ చిత్రంగా మే 1న రెట్రో విడుదలైంది. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించగా.. జోజూ జార్జ్‌, జయరామ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌గా సూర్య ఇందులో నటించాడు.

రెట్రో సినిమా మే 31న ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌(Netflix) అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడలో స్ట్రీమింగ్‌ కానుంది. రెట్రో సినిమా 18 రోజుల్లో రూ. 235 కోట్లు రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.  సూర్య కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా మొదటి స్థానంలో రెట్రో ఉంది. ఆ తర్వాత 24 మూవీ రూ. 157  కోట్లు, సింగం2 రూ. 122 కోట్లు, కంగువా రూ. 106 కోట్లు, 7th సెన్స్‌ రూ. 113 కోట్లు, సికిందర్ రూ. 95 కోట్లతో వరుసగా ఉన్నాయి. అయితే, ఈ మూవీ ఫైనల్‌గా రూ. 250 కోట్ల కలెక్షన్స్‌ దాటిందని సినీ వర్గాలు అంచనా వేశాయి.

కథేంటంటే..
గ్యాంగ్‌స్టర్ తిలకన్ (జోజు జార్జ్) కొడుకులా పెంచుకున్న పారివేల్ కన్నన్ (సూర్య)తో  గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుని చలామణి సాగిస్తుంటారు. ఒక ఢీల్‌(గోల్డ్‌ఫిష్‌) విషయంలో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. దీంతో పెంచిన తండ్రితో తెగదెంపులు చేసుకుని తాను ప్రేమించిన రుక్మిణి (పూజా హెగ్డే)తో జీవితాన్ని గడపాలనుకుంటాడు. ఈ క్రమంలో తిలకన్‌ వల్ల పారివేల్‌ కన్నన్‌  ఐదేళ్లు జైలుకు వెళ్తాడు. దీంతో  గొడవలు అంటే నచ్చని రుక్మిణి అతని జీవితం నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఆచూకి వివరాలు తెలుసుకోవాలని తన గ్యాంగ్‌ను కోరతాడు పారివేల్‌. చివరికి ఆమె అండమాన్‌లకు దూరంగా ఒక ఐల్యాండ్‌లో ఉన్నట్లు వివరాలు తెలుసుకుంటారు. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి  తప్పించుకున్న పారివేల్‌ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు. అదే సమయంలో తనను పెంచిన తండ్రి తిలకన్‌ కూడా ఒక ఢీల్‌కు సంబంధించి అదే ఐలాండ్‌కు చేరుకుంటాడు.

అయితే, అప్పటికే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్‌తో రాజ్‌వేల్‌ దొర (నాజర్‌) అతని కుమారుడు మైఖేల్‌ ఉంటారు. అక్కడి ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దారుణాలు చేస్తుంటారు. వారితో ఒక ఢీల్‌ సెట్‌ చేసుకుని తిలకన్‌ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్‌  ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్‌ వార్‌ మొదలౌతుంది. అక్కడి నుంచి  గోల్డ్‌ఫిష్‌ వేట కొనసాగుతుంది. ఇంతకీ గోల్డ్‌ఫిష్‌ సీక్రెట్‌ ఏంటి..? దాని కోసం పెంచిన కొడుకునే తండ్రి చంపాలని ఎందుకు అనుకుంటాడు..? అనాధగా ఉన్న పారివేల్‌కు ఆ ఐల్యాండ్‌తో ఉన్న గత సంబంధం ఏంటి..? పారివేల్‌ జన్మించక ముందే రాజ్‌వేల్‌ దొర (నాజర్‌)తో ఉన్న లింక్‌ ఏంటి..? ఫైనల్‌గా రుక్మిణిని పారివేల్‌ పెళ్లి చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.

#

Tags : 1

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)