ఏపీ అభివృద్ధికి తారకమంత్రం.. ప్రజల్లో మావిగన్ క్రేజ్
కోల్పోయినవారికే విలువ తెలుస్తుంది: రెజీనా
Published on Sat, 04/18/2026 - 07:11
జీవితంలో ప్రతి ఒక్కరికీ ప్రతి సంఘటన ఒక అనుభవమే. అలాంటి అనుభవాలు చాలా పాఠాలు నేర్పుతాయి. కోల్పోయిన వాటి విలువలను తెలియ జేస్తాయి. ఒక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే ఇక్కడ చాలా కథలు వెలుగు చూస్తాయి. అలాంటి పలు అనుభవాలను కలిగిన నటీమణుల్లో రెజీనా(Regina Cassandra) ఒకరు. అచ్చ తమిళ అమ్మాయి–2005 కండనాళ్ మొదల్ చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. తెలుగులో SMS చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
అయితే, కోలీవుడ్‌లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపును పొందన రెజీనా ఆ తరువాత తమిళంతో పాటు, తెలుగు, కన్నడం, హిందీ తదితర భాషల్లో నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నారు. ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోయిన్గా రాణించారు. అయితే కథానాయకిగానే కాకుండా నటనకు అవకాశం ఉంటే ప్రతినాయకిగానూ నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. 35 ఏళ్ల ఈ భామ ఇప్పటికీ అవివాహితే. ఈమె ఇటీవల తన ఇన్‌స్టాలో ప్రేమ గురించి తెలిపారు.
‘ఒక రోజే నేను ప్రేమకు సరెండర్ అయ్యాను. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది జరగడం ఆగిపోదు కానీ, దానిని కొందరు బలహీనంగా భావిస్తున్నారు. అయితే ప్రేమ అనేది ఒక ప్రశాంతతో కూడిన బలం. ప్రతిరోజు మీ కోసం మీరు చిరునవ్వుతో లేచి నిలబడాలి. మీరు ప్రేమను అందించడానికి అర్హులు అనేది ఎప్పుడూ గుర్తుంచుకోండి. దాన్ని సాధారణంగా భావించరాదు. ప్రేమించడంలోనూ, ప్రేమించబడడంలోనూ ఉండే సంతోషం మనకు తెలియడానికి కారణం, దాన్ని కోల్పోవడంలోఉండే బాధ మనకు తెలుసు అన్నదే’ అని నటి రెజీనా పేర్కొన్నారు. ఈమె పోస్ట్‌కు కారణం ఏమిటి, స్వానుభవమా? అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నటి రెజీనా ఫ్లాష్‌బ్యాక్, మూక్కుత్తి అమ్మన్–2, ది వైవ్స్, హిందీలో సెక్షన్ 108 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Tags : 1