Breaking News

రష్మిక, మురగదాస్‌ ఇద్దరి మాట ఒక్కటే..

Published on Thu, 01/22/2026 - 07:21

ఎవరైనా విజయాలను తమకు ఆపాదించుకోవడంలో ముందుంటారు. అపజయాలను ఇతరులపై నెడుతుంటారు. ఇది సహజం. అపజయాలకు బాధ్యత వహించేవారు చాలా తక్కువనే చెప్పాలి. ఆ మధ్య సల్మాన్‌ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటించిన హిందీ చిత్రం సికిందర్‌. తమిళ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం  భారీ అంచనాల మధ్య విడుదలై పూర్తిగా నిరాశ పరచింది. దీంతో ఈ చిత్రం ఫ్లాప్‌పై దర్శకుడు మురుగదాస్‌ స్పందిస్తూ ఉత్తరాదిలో సల్మాన్‌ఖాన్‌ బెదిరింపులను ఏదుర్కొంటున్న కారణంగా షూటింగ్‌ను పగలు చేయడం సాధ్యం కాక పగలు చిత్రీకరించాల్సిన సన్నివేశాలను కూడా రాత్రి వేళల్లో చేయాల్సి వచ్చిందని చెప్పారు. 

సల్మాన్‌ఖాన్‌ షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చేవారు అని చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. సికిందర్‌ డిజాస్టర్‌లో తన పాత్ర లేదని కూడా చెప్పారు. దీంతో సల్మాన్‌ అభిమానులు దర్శకుడు మురుగదాస్‌పై విమర్శల దాడి చేశారు. సల్మాన్‌ఖాన్‌ కూడా మురుగదాస్‌ వ్యాఖ్యలకు పరోక్షంగా గట్టిగానే బదులిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో రష్మిక మందన్నా ఆజ్యం పోసేలా వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ సికిందర్‌ కథను దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్‌ తనకు చెప్పినప్పుడు బాగుందని. 

అయితే షూటింగ్‌లో వేరే విధంగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆ చిత్ర అపజయంలో తన బాధ్యత లేదని చెప్పే ప్రయత్నం చేశారు. కాగా హిందీలో మంచి సక్సెస్‌లో ఉన్న రష్మిక మందన్నాకు సికిందర్‌ చిత్రం పూర్తిగా నిరాశపరిచందన్నది గమనార్హం. మొత్తం మీద సికిందర్‌ చిత్రం విడుదలై చాలా కాలం అయినా, దాని గురించి రచ్చ ఇంకా జరుగుతూనే ఉందన్నది గమనార్హం. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)