Breaking News

కోహ్లీ లైక్‌తో 20 లక్షలు మంది ఫాలో.. ఇంత ఖాళీగా ఉన్నారా: రకుల్‌

Published on Fri, 05/30/2025 - 09:27

బాలీవుడ్‌ నటి అవ్‌నీత్‌ కౌర్‌(Avneet Kaur) ఫ్యాన్‌ పేజీలోని ఒక పోస్ట్‌ను క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ( Virat Kohli) లైక్‌ చేయడంతో ఆ వార్త సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్‌ అయింది. ఇప్పుడు దాని గురించి హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌( Rakul Preet Singh) మాట్లాడారు. దేశంలో మనం ఇంత కాళీగా ఉన్నామా అంటూ తనదైన స్టైల్లో కామెంట్‌ చేసింది. ఇలాంటి వాటిని ఎందుకు వైరల్‌ చేస్తారని ఆమె ప్రశ్నించారు. అవసరం లేని విషయాలకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంతమాత్రం కరెక్ట్‌ కాదని సూచించారు.

అవ్‌నీత్‌కౌర్‌ ఫ్యాన్‌ పేజీలోని ఒక ఫోటోను విరాట్‌ లైక్‌ చేయడంపై రకుల్‌ ఇలా చెప్పుకొచ్చారు. ' ఈ అంశం నన్ను చాలా బాధించింది. హమ్ బోహోత్ వేలే హై (మనమంతా ఇంత ఖాళీగా ఉన్నామా..) అనిపించింది. విరాట్‌ లైక్‌ వల్ల ఆమెకు(అవ్‌నీత్‌కౌర్‌) 20 లక్షల మంది ఫాలోవర్స్‌ కొన్ని గంటల్లోనే పెరిగారు. పొరపాటున లైక్‌ బటన్‌ ప్రెస్‌ అయిందని చెప్పినా కూడా పెద్ద సంఖ్యలో ఆమెను అనుసరించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో  ఒక్కోసారి మనం కూడా పొరపాటున స్నేహితులను అన్‌ఫాలో చేయడం జరుగుతుంది. ఇలాంటివి చాలా కామన్‌గా జరిగే అంశాలు. విరాట్‌ కూడా వివరణ ఇచ్చారు. కానీ, విరాట్‌ సెలబ్రిటీ కాబట్టి ఆయనకు నచ్చిన, నచ్చని అంశాలు అన్నీ వార్తలుగా మారిపోతున్నాయి. ఆయన వ్యక్తిగత విషయాలను కూడా ఇలా వైరల్‌ చేయడం చాలా విచారకరమైన విషయం. సోషల్‌ మీడియాలో చాలామంది సమయాన్ని వృథా చేస్తున్నారు.' అని ఆమె అన్నారు.

ఆ అంశంపై కోహ్లీ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఫీడ్‌ను క్లియర్‌ చేస్తున్న క్రమంలో పొరపాటున లైక్‌ బటన్‌ ప్రెస్‌ అయి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు. ఈ అంశంలో ఎలాంటి ఉద్దేశం లేదని కూడా చెప్పారు. అవసరంలేని ప్రచారాలు చేయకండని కూడా కోరారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)