Breaking News

ముచ్చటగా మూడోసారి!

Published on Fri, 10/17/2025 - 04:38

హీరో రజనీకాంత్, డైరెక్టర్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌లది హిట్‌ కాంబినేషన్‌. వీరి కాంబోలో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్‌’ 2023 ఆగస్టు 10న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి కలయికలో ‘జైలర్‌ 2’ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘జైలర్‌’ సూపర్‌ హిట్‌ కావడంతో ‘జైలర్‌ 2’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

2026 జూన్‌లో ‘జైలర్‌ 2’ విడుదల కానుంది. ఇదిలా ఉంటే... రజనీకాంత్‌– నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ కాంబినేషన్‌ ముచ్చటగా మూడోసారి రిపీట్‌ కానుందని కోలీవుడ్‌ టాక్‌. ఇప్పటికే ‘జైలర్‌ 2’ చిత్రీకరణ సుమారు 70 శాతం పూర్తయిందట. ఈ సినిమా తర్వాత మరోసారి రజనీకాంత్‌తో ఓ మూవీ కోసం నెల్సన్‌ దిలీప్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నారని టాక్‌. ఈ స్టోరీ లైన్‌ని ఇటీవల రజనీకాంత్‌కి వినిపించగా ఆయన కూడా పచ్చజెండా ఊపారట. మరి... రజనీ–నెల్సన్‌ కాంబినేషన్‌లో మూడో చిత్రం ఉంటుందా? అనే విషయం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.  

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)