Breaking News

అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్‌

Published on Tue, 10/01/2024 - 06:57

కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్‌ 1 మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెళ్లడించారు.

జైలర్‌ సినిమా తర్వాత రజనీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్‌ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్‌ కనగరాజ్‌ చిత్రం కూలీ షూటింగ్‌ షెడ్యూల్‌ ముగించుకుని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్‌లో రజనీకాంత్‌ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి: 'హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం'
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)