Breaking News

'చిరంజీవి, మోహన్ లాల్' బెస్ట్‌ యాక్టర్‌ ఎవరు..? రాధిక సమాధానం వైరల్‌

Published on Fri, 02/20/2026 - 08:48

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో రాధిక శరత్ కుమార్, సుహాసిని ఇద్దరూ ప్రత్యేక స్థానం దక్కించుకున్నారు. వీరిద్దరూ ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించి ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. మంచి స్నేహితులుగా ఉంటూనే  తరచుగా వ్యక్తిగత, వృత్తిపరమైన వేదికలపై కలిసి కనిపిస్తుంటారు. టాలీవుడ్, కోలీవుడ్‌, మలయాళ పరిశ్రమలకు చెందిన నటీనటులు అందరూ రీ యూనియన్ పేరుతో సందడి చేస్తారు. అయితే, తాజాగా సుహాసిని హోస్ట్‌గా రాధిక శరత్ కుమార్ గెస్ట్‌గా ఒక ఇంటర్వ్యూ జరిగింది. బాగా నచ్చిన హీరో ఎవరు అనే ప్రశ్నకు రాధిక చెప్పిన ర్యాపిడ్‌ సమాధానాలు కోలీవుడ్‌లో వైరల్‌ అవుతున్నాయి.

సుహాసిని అడిగిన ర్యాపిడ్‌ ప్రశ్నలకు రాధిక సమాధానం చెప్పారు. ఈ క్రమంలో చిరంజీవి, మోహన్‌లాల్‌ ఇద్దరిలో ఎవరు బెస్ట్‌ యాక్టర్‌ అంటూ సుహాసిని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా మోహన్‌లాల్‌ పేరును రాధిక చెప్పారు. మోహన్‌లాల్‌ గ్రేటెస్ట్‌ యాక్టర్‌ ఆఫ్‌ ఇండియా అంటూ ప్రశంసించారు.

అయితే, ఆ వెంటనే సుహాసిని మరో ర్యాపిడ్‌ ప్రశ్న వేశారు. మోహన్‌లాల్‌, కమల్‌ హాసన్‌లలో ఎవరు బెస్ట్‌ యాక్టర్‌ అని అడిగారు. దీంతో వెంటనే కమల్‌ హాసన్‌ అంటూ సమాధానం ఇచ్చారు. కమల్‌ హాసన్‌, శరత్‌ కుమార్‌లలో ఎవరు బెస్ట్‌ యాక్టర్‌ అనే ప్రశ్నకు కూడా కమల్‌నే ఉత్తమ నటుడు అని రాధిక చెప్పడం విశేషం. అయితే, చిరంజీవి కంటే మోహన్‌లాల్‌ బెస్ట్‌ యాక్టర్‌ అని రాధిక చెప్పడంతో మెగా ఫ్యాన్స్‌ కామెంట్ల రూపంలో మండిపడుతున్నారు.

అయితే, నెటిజన్లు మాత్రం చిరు, మోహన్‌లాల్‌ ఇద్దరూ గొప్ప నటులేనని ఆ ఇంటర్వ్యూను సరదాగా మాత్రమే తీసుకోవాలని సూచిండం విశేషం. మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌కు ఇప్పటివరకు మొత్తం 5 జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కాయి. పద్మశ్రీ, పద్మ భూషణ్‌తో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ విభాగం నుంచి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తింపు పొందిన ఏకైక నటుడిగా మోహన్‌లాల్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)