Breaking News

కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్న 'శ్రీతేజ్‌'

Published on Thu, 01/30/2025 - 08:52

పుష్ప2(Pushpa 2: The Rule) సినిమా రేవతి(32) కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. డిసెంబర్‌ 4న పుష్ప2 ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని  థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఎప్పటికీ మరిచిపోలేము. ఈ ఘటనలో రేవతి అక్కడికక్కడే మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్‌(9) తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన జరిగి 56 రోజులు పూర్తి అయినా బాలుడి ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు లేదని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికీ  సికింద్రాబాద్‌ కిమ్స్‌ (Kims) ఆసుపత్రిలోనే బాలుడు చికిత్స పొందుతున్నాడు.

శ్రీతేజ్‌కు వెంటిలేటర్‌ తొలగించి ప్రత్యేక గదికి వైద్యులు షిఫ్ట్‌ చేశారు. తానే సొంతంగా ఆక్సీజన్‌ తీసుకుంటున్నాడు. అయితే, కుటుంబ సభ్యులు పిలిచినా కళ్లు తెరిచి చూడలేకున్నాడు. వారిని గుర్తుపట్టలేనంతగా బాలుడు ఉన్నాడు. కనీసం నోరు విప్పి ఒక్కమాట కూడా మాట్లాడలేకున్నాడు. తనకు ఆహారం కూడా ముక్కు వద్ద అమర్చిన సన్నని గొట్టం ద్వారానే అందిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను శ్రీతేజ గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు తెలిపారు. 

(ఇదీ చదవండి: కుటుంబంలో విషాదం.. పాడె మోసిన రానా)

కానీ, అతని శరీరంలో ఇతర జీవ ప్రక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని డాక్టర్‌ చేతన్, డాక్టర్‌ విష్ణుతేజ్‌ తెలిపారు. అయితే బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో వైద్యులు కూడా చెప్పలేని పరిస్థితి నెలకొందని అన్నారు. శ్రీతేజ త్వరగా కోలుకొని మళ్లీ గతంలో మాదిరి తన కళ్లముందు తిరుగుతే చూడాలని ఉందని తన తండ్రి కోరుకుంటున్నాడు.

రేవతి కుటుంబానికి అల్లు అ‍ర్జున్‌ పేరుతో అల్లు అరవింద్‌ రూ. కోటి సాయం ప్రకటించారు.  డైరెక్టర్‌ సుకుమార్‌ రూ. 50 లక్షలు అందించారు. మైత్రీ మూవీ మేకర్స్  రూ. 50 లక్షలు ప్రకటించగా.. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌ రాజుకు గతంలోనే అందించారు. 

అల్లు అర్జున్‌ కూడా శ్రీతేజను పరామర్శించారు. రేవతి కుటుంబానికి జరగరాని నష్టం జరిగిందని  ఆ సమయంలో అన్నారు. ఆపై వారి కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటానని తెలిపారు. ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని ఆయన వాపోయారు.  బాబు పూర్తిగా కోలుకునే దాకా పూర్తి బాధ్యత తనదేనని బన్నీ ప్రకటించారు. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ తానే భరిస్తానని కూడా శ్రీతేజ తండ్రి భాస్కర్‌తో  అల్లు అర్జున్‌ గతంలో అన్నారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)