'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' స్పూఫ్ షార్ట్ ఫిల్మ్ వైరల్.. మీరు చూశారా?

Published on Sun, 12/31/2023 - 16:43

ఒకప్పుడేమో ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా నడుస్తోంది. ఎవరికి వాళ్లే తమ టాలెంట్‌ని చూపించుకుంటున్నారు. ఒకవేళ కంటెంట్ బాగుంటే మాత్రం ఫుల్ వైరల్ అయిపోతున్నారు. అలా '7 ఆర్ట్స్' వీడియోలతో సరయు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఫుల్ ఫేమస్ అయ్యారు. వారి షార్ట్ ఫిల్మ్స్, వీడియోలు యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నాయి. ఇప్పుడు వీళ్ల నుంచి 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్' షార్ట్ ఫిల్మ్ రిలీజైంది.

(ఇదీ చదవండి: 'గుంటూరు కారం' పాట.. కుర్చీ తాతకి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

2021 డిసెంబరులో థియేటర్లలోకి వచ్చిన 'పుష్ప'.. దేశవ్యాప్తంగా ఓ రేంజ్‌లో క్రేజ్ దక్కించుకుంది. ప్రస్తుతం సీక్వెల్ షూటింగ్‌తో మూవీ టీమ్ బిజీగా ఉంది. ఇలాంటి టైంలో 'పుష్ప పార్ట్ 2 ఫస్ట్ నైట్'  పేరుతో ఓ స్ఫూప్ వీడియో చేశారు. 'పుష్ప' మూవీలోని పాత్రలను పోలిన కారెక్టర్లే ఈ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఉన్నాయి. పుష్పరాజ్‌గా శ్రీకాంత్ రెడ్డి.. శ్రీవల్లిగా సీమ నటించారు. 

ఈ కాన్సెప్ట్ రాసుకుని, దర్శకత్వం వహించి, ఎడిటింగ్ కూడా శ్రీకాంత్ రెడ్డి చేశాడు. 'పుష్ప 2' కాన్సెప్ట్‌ ఎలా ఉంటుందో ఊహించుకుని తన స్టైల్లో శ్రీకాంత్ రెడ్డి ఈ స్పూప్‌ని తీసినట్లు తెలుస్తోంది. షెకావత్ తనను బ్రాండ్ అని అవమానించడం, పుష్ప రాజకీయాల్లోకి రావాలనుకోవడం, తన ఇంటి పేరు తనకు తిరిగి వచ్చి ఓ బ్రాండ్ ఏర్పడటం ఇలా శ్రీకాంత్ రెడ్డి రాసుకున్న స్పూఫ్ లైన్ బాగుంది. ఇందులో శ్రీకాంత్ రెడ్డి నటన, చిత్తూరు యాస బాగుంది. అన్ని పాత్రలు చక్కగా కుదిరాయి. ఈ స్ఫూప్ ఎంతో ఫన్నీగా ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Videos

"మళ్ళీ జగనే" ఎలక్షన్ రిజల్ట్స్ పై పరిపూర్ణానంద స్వామి రియాక్షన్

నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు

తాజ్ ఎక్స్ ప్రెస్ లో మంటలు దగ్ధమైన నాలుగు భోగీలు

కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

చంద్రబాబుకు పిక్చర్ అర్థం అయ్యింది..

ఫ్లాష్ ఫ్లాష్ తెలంగాణ ఎలో అలెర్

పూర్తి ఆధారాలతో హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కఠినమైన ఆంక్షల మధ్య కౌంటింగ్

ఎగ్జిట్ పోల్స్ పై కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు

Photos

+5

అనంత్‌- రాధిక ప్రీవెడ్డింగ్‌: ఇటలీలో ఎంజాయ్‌ చేస్తున్న ధోని ఫ్యామిలీ (ఫొటోలు)

+5

AP: కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌.. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

తెలంగాణ రాష్ట్ర గీతం పాడిన సింగర్‌ హారిక నారాయణ్‌ (ఫోటోలు)

+5

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు (ఫొటోలు)

+5

త్వరలో పెళ్లి.. వెకేషన్‌లో చిల్‌ అవుతున్న సిద్దార్థ్‌- అదితి (ఫోటోలు)

+5

T20WC2024 USA vs Canada Highlights: కెనడా జట్టుపై అమెరికా సంచలన విజయం (ఫొటోలు)

+5

రెండేళ్లలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశాం.. ఇక ముందు: దీపక్‌ చహర్‌ భావోద్వేగం (ఫొటోలు)

+5

T20 WC 2007: ధోని నమ్మకం నిలబెట్టిన వరల్డ్‌కప్‌ విజేత.. ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? (ఫోటోలు)

+5

Kiccha Sudeep Daughter Sanvi: కిచ్చా సుదీప్‌ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా? (ఫోటోలు)

+5

Dimple Hayathi Visits Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్‌ హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫొటోలు)