Breaking News

కొత్త తరం సంగీతానికి సిద్ధం

Published on Fri, 10/10/2025 - 04:19

విజయ్‌ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘పూరిసేతుపతి’ (వర్కింగ్‌ టైటిల్‌) అనే  పాన్‌ ఇండియా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో టబు, విజయ్‌ కుమార్, బ్రహ్మాజీ కీలక  పాత్రల్లో కనిపించనున్నారు. పూరి కనెక్ట్స్, జేబీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, జేబీ నారాయణరావు కొండ్రోల్లా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న జాతీయ అవార్డుగ్రహీత హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ‘పూరిసేతుపతి’కి సంగీతం అందించనున్నారని మేకర్స్‌ ప్రకటించారు. 

ఈ విషయాన్ని తెలియజేస్తూ హర్షవర్ధన్‌తో పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘పూరి జగన్నాథ్, వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న  పాన్‌ ఇండియా మూవీ ‘పూరిసేతుపతి’. యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్‌ కలగలిసిన న్యూ జనరేషన్‌ మ్యూజిక్‌ని ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి సిద్ధంగా ఉండండి. ప్రధాన నటీనటులు  పాల్గొనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ వచ్చే వారం ప్రారంభం అవుతుంది. 

ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈ చిత్రానికి సీఈఓ: విష్ణు రెడ్డి. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)