Breaking News

సినిమా రాజకీయాలను తట్టుకోలేక పోయాను

Published on Wed, 03/29/2023 - 05:46

హిందీ పరిశ్రమలో కొందరు చేసిన రాజకీయాలను తట్టుకోలేకపో యానని, అందుకే ఇటీవల హిందీ చిత్రాల సంఖ్య తగ్గించాననీ అంటున్నారు ప్రియాంకా చోప్రా . నటిగా ఇరవై సంత్సరాల సుదీర్ఘమైన కెరీర్‌ ఉన్న ప్రియాంకా చోప్రా ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాలీవుడ్‌లో ఓ హాట్‌ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు తాను షిఫ్ట్‌ కావడం గురించి ప్రియాంకా చోప్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

‘‘బాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొందరు నన్ను ఒక మూలకు నెట్టివేయడానికి ప్రయత్నించారు. నాకు అవకాశాలు రాకుండా చేయడానికి ఓ గ్రూప్‌ ఏర్పాటైందని నాకు అర్థమైంది. ఈ క్రమంలో నాకు కొందరితో విభేదాలు తలెత్తాయి. ఈ పొలిటికల్‌ గేమ్స్‌ ఆడటం నావల్ల కాదనిపించింది. ఇక లాభం లేదని నేను బాలీవుడ్‌కు బిగ్‌ బ్రేక్‌ ఇవ్వాలనుకున్నాను.

ఇప్పటి నా మేనేజర్‌ అంజులా ఆచార్య ఓ మ్యూజిక్‌లో నన్ను చూసి మ్యూజిక్‌ ప్రపంచంలో నీకు ఆసక్తి ఉందా? అని అడిగారు. ఓకే చెప్పి, యూఎస్‌ వెళ్లాను. అలా ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లగలిగాను. కొత్త అవకాశాలు కూడా వచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు ప్రియాంకా చోప్రా . ఇక హాలీవుడ్‌లో ‘క్వాంటికో’, ‘బేవాచ్‌’ వంటి ప్రాజెక్ట్స్‌ చేశారు ప్రియాంక. ప్రస్తుతం ప్రియాంక నటించిన ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్, ఇంగ్లిష్‌ చిత్రం ‘లవ్‌ ఎగైన్‌’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.

అలాగే హిందీలో ‘జీలే జరా’ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ లీడ్‌ రోల్‌ చేయనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రియాంక చేసిన వ్యాఖ్యలకు కంగనా స్పందిస్తూ.. ‘‘బాలీవుడ్‌ మాఫియా గ్యాంగ్‌ ప్రియాంకా చోప్రా ను ఇండియా నుంచి అమెరికాకు పంపేసింది.  ఇందుకు కారణం దర్శక–నిర్మాత కరణ్‌ జోహార్‌’’ అని ఆరోపిస్తూ ట్వీట్స్‌ చేశారు. 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)