రాజ్ తో సమంత రిలేషన్‌ను బయటపెట్టేసిన సీనియర్ నటి..!
Breaking News
12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు ప్రభాస్.. లక్ష మందికి భోజనాలు!
Published on Thu, 09/29/2022 - 12:06
రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ఆయన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. గురువారం మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రభాస్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు రావడంతో...అతన్ని చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలి వచ్చారు. పట్టణంలో కొంతమంది అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Love you.. ela vunnaru!! #Prabhas ❤️🥺 pic.twitter.com/rYu7J8oXfP
— .. (@charanvicky_) September 29, 2022
నేటి మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు వేణు గోపాల కృష్ణ, రోజా, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాద్ రాజు పాల్గొననున్నారు. సుమారు లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులకు ఆయన ఇంటి ఆవరణలో ఏర్పాటు చేశారు. మిగిలిన వారందరికీ కృష్ణంరాజు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. 2010లో తండ్రి సూర్య నారాయణ రాజు మరణించిన సమయంలో ప్రభాస్ మొగల్తూరు వెళ్లారు. ఆ సమయంలో వారం రోజుల పాటు అక్కడే ఉండి సంతాప కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్లీ కృష్ణంరాజు సంస్మరణ సభ కోసం ప్రభాస్ ఈ ప్రాంతానికి వచ్చాడు.
2 Minutes Silence 🤫 For Those People Who Underestimated About #Prabhas Craze In AP 😎pic.twitter.com/J7zDqamTkF
— Prabhas DOMAIN 🏹 (@Prabhas_Domain) September 29, 2022
Tags : 1